గంగోత్రి సినిమాతో హీరోగా అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా చిరుత సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్ లో తెరంగేట్రం చేశారు. అటు అల్లు అర్జున్ ఇటు రామ్ చరణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. కెరీర్ పరంగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ హీరోలలో చరణ్, బన్నీ ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు యూనిటీతో ఉండటంతో ఈ ఫ్యామిలీ హవా ఎక్కువగా ఉందనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.
అయితే బన్నీ చరణ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఈ ఇద్దరు స్టార్ హీరోలు మాట్లాడుకోవడం లేదని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పుష్ప పార్ట్ 1 రిలీజ్ డేట్ వల్లే ఇద్దరు హీరోలు మాట్లాడుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 17వ తేదీన తమ సినిమాను కూడా రిలీజ్ చేయాలని ఆచార్య మేకర్స్ భావించారని అయితే పుష్ప మేకర్స్ వెనక్కు తగ్గబోమని చెప్పడంతో ఆ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4కు వాయిదా పడిందని తెలుస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలో బన్నీ, చరణ్ ఫ్యాన్స్ మధ్య దూరం పెరిగింది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం బన్నీ, చరణ్ మధ్య మాటలు లేవని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ గురించి అల్లు అర్జున్ పాజిటివ్ గా స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు మూడు వారాల గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.