నిన్నమొన్నటివరకూ క్రిష్ కు తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా మంచి పేరు ఉండేది. కానీ.. ఆయనకు కాలం కలిసిరావడం లేదనుకుంటా. తెలుగులో నిర్మాతగా “అంతరిక్షం”, దర్శకుడిగా “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రాలు కోలుకోలేని షాక్ ను ఇవ్వగా.. హిందీలో “మణికర్ణిక”తోనూ డిజాస్టర్ దక్కించుకొని రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యాడు. ఇక “మణికర్ణిక” సినిమా నుంచి దర్శకుడిగా తప్పుకోవడం గురించి స్పందిస్తూ.. “సోను పోషించిన సదాశివరావు పాత్ర ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితంలో కీలకమైన పాత్ర. కానీ ఆ పాత్రని ముందే చంపేయమని కంగనా కోరింది.
క్రిష్ ఇచ్చిన వివరణ పక్కన పెడితే.. ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ “ఎన్టీఆర్ మహానాయకుడు”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని తాపత్రయపడుతున్నాడు క్రిష్. మరి క్రిష్ కోరిక ఫలించి ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందో లేక ఆ రెండు సినిమాల సరసన చేరి క్రిష్ ను ఇంకాస్త ఢీలా పడేలా చేస్తుందో చూడాలి.