పవన్ స్టోరీ లైన్ తో రజినీ సినిమా?

లీకులు అనేవి ఇప్పట్లో సర్వసాధారణమైపోయింది. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా సరే… ఆ సినిమాకి సంబందించిన ఏదో ఒక ఆన్ సైట్ ఫోటోలో… లేక వీడియోనో లీక్ అవుతూనే ఉంటూనే ఉంది. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాలకైతే ఇది మరీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రజినీ కాంత్ ను చూశామనే ఆనందంతోనో ఏమో కొందరు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవి కాస్త వైరల్ అవడం వంటివి జరుగుతున్నాయి.

ఇందులో భాగంగానే.. రజినీ కాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’ షూటింగ్ ఫోటోలు కూడా లీక్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం షూటింగ్ స్పాట్ నుండీ ఓ ఫోటో లీక్ అయ్యింది. ఈ లీక్డ్ ఫోటోల్లో రజనీకాంత్ ఖాకీ ధరించి ఏదో సీరియస్ ఆపరేషన్ కి రెడీ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ నయనతార కూడా ఉంది. ఆమె ‘డార్క్ బ్లూ కలర్ దుస్తుల్లో’ కనిపిస్తుంది. ప్రస్తుతం వీరి పై ముంబైలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నాడు మురుగదాస్. ఇలా ఫోటోలు లీక్ అవ్వడంతో డైరెక్టర్ మురుగదాస్ అసహనానికి గురయ్యాడట. ఇక ఈ ఫోటో చూసి ఈ చిత్ర కథ ఇదేనంటూ కథనాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ‘ప్రస్తుతం సమాజంలో నేరాలు ఘోరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇంకా పాత చట్టాల్ని ఫాలో అయితే ఈ నేరాల్ని ఆపలేము అని అని భావించి… తనకంటూ ఓ చట్టం తయారు చేసుకుని… సమాజంలో సమస్యల్ని పరిష్కరించాలని ఓ పోలీస్ ఆఫీసర్ ఆ దారిలో వెళ్తుంటాడు. ఇది కాస్త పవన్ కల్యాణ్ నటంచిన ‘గబ్బర్ సింగ్’ లా ఉన్నట్టు అనిపించక మానదు. మరి రజనీ స్టైల్ లో మురుగదాస్ ఈ కథను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.

1

2

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus