‘సరిలేరు నీకెవ్వరు’ ప్లాప్ సెంటిమెంట్లు మహేష్ అభిమానులని నిద్రలేకుండా చేస్తున్నాయట..!

మహేష్ బాబు కాస్త స్పీడ్ పెంచి మరీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యూనిట్ మొత్తం ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాకపోతే మహేష్ అభిమానులను మాత్రం కొన్ని సెంటిమెంట్ లు భయపెడుతున్నాయట.

అందులో మొదటిది ఈ చిత్రం నుండీ మొదటి పాటని విడుదల చేసారు. అది అంతగా ఆసక్తికరంగా లేదు. మరో పక్క ఈ చిత్రానికి పోటీ గా వస్తున్న ‘అల వైకుంఠపురములో’ ఫస్ట్ సింగిల్ అదరకొట్టేసింది. ఓ రకంగా ఆ సినిమాకి ప్రమోషనే అవసరం లేదు అనేంతలా ఆ పాట హిట్ అయ్యింది.

ఇక రెండో సెంటిమెంట్… నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర. ఆయన సొంత బ్యానర్ ‘ఏకె ఎంటర్టైన్మెంట్స్’ లో ఇప్పటి వరకూ ఒక్క హిట్టు కూడా లేదు.

మూడో సెంటిమెంట్… ఈ చిత్రంలో మురళీ శర్మ ఓ ప్రత్యెక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన నటించిన చిన్న హీరోల సినిమాలు హిట్ అయ్యాయి కానీ ‘అజ్ఞాతవాసి’ ‘అతిధి’ ‘సాహో’ ‘డీజె’ ‘ఎవడు’ ‘ఊసరవెల్లి’ వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. ఓ రకంగా ఈయన నటించిన పెద్ద హీరోల సినిమాలు హిట్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు.

నాలుగో సెంటిమెంట్… ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ఈయన గొప్ప టెక్నిషియన్. కానీ ఈయన మహేష్ తో చేసిన ‘1 నేనొక్కడినే’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు ఘోరమైన డిజాస్టర్లు గా మిగిలాయి.

మరి ఇన్ని బ్యాడ్ సెంటిమెంట్ లు ఉన్నాయి కాబట్టే .. మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus