Sr NTR: తొమ్మిది నెలలలోనే 90 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని మట్టిలో కలిపిన ఎన్టీఆర్?

సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంతో మంది రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా సినిమాలలో మంచి గుర్తింపు సంపాదించుకొని రాజకీయాలలోకి ముఖ్యమంత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నందమూరి తారక రామారావు ఒకరు. ఈయన కేవలం తన భార్య బసవతారకానికి ఇచ్చిన మాట ప్రకారమే రాజకీయాలలోకి వచ్చి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

1981వ సంవ‌త్స‌రంలో కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఢిల్లీలో నిర్వ‌హించ‌డం వల్ల రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో బసవతారకం గారు మీరు రాజకీయాలలోకి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారట. ఈ విధంగా తన భార్య కోరడంతో ఎన్టీఆర్ లో రాజకీయాల ఆలోచనలు మొదలయ్యాయి. అదే సమయంలోనే ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ చేస్తున్నారు.

ఈ సమయంలోనే విలేకరి ఎన్టీఆర్ ని ప్రశ్నిస్తూ మరి కొద్ది రోజులలో మీకు 60 సంవత్సరాలు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారట. ఈ సందర్భంగా ఆయన నెలలో 15 రోజులు ప్రజాసేవ చేయబోతున్నానని వెల్లడించారు. ఈ విధంగా తన రాజకీయ ప్రస్థానానికి మొదటి అడుగు పడిందని తెలుస్తోంది.

ఈ విధంగా ఈయన 1982 మార్చి 28న హైదరాబాద్ కి రాగా ఈయనకు రెడ్ కార్పెట్ పై స్వాగతం పలికారు. మార్చ్ 28 మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈయన పార్టీని స్థాపించబోతున్నానని ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ అని నామకరణం చేశారు. ఈ విధంగా టిడిపి ఆవిర్భావం జరిగిన తర్వాత చైతన్య రథం పేరిట ఈ పార్టీ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్టీఆర్ ప్రతి ఒక్కరిలోనూ నమ్మకం కలిగించేలా ప్రచారం చేశారు.

ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెడతారని నమ్మిన అభిమానులు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఎన్నికల అనంతరం 1983జ‌న‌వ‌రి 07న మ‌ధ్యాహ్నం ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌క‌ట‌న జ‌రిగింది. తెలుగుదేశం 199 కాంగ్రెస్ 60, సీపీఐ 4, సీపీఐ (ఎం) 5 బీజేపీ 3 సీట్లు గెలుచుకున్నాయి.ఈ విధంగా పార్టీ స్థాపించిన కేవలం 9 నెలలలోనే ప్రభంజనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ 90 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ఎంతో మందిప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని చెప్పాలి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus