మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం.. ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ లో తల్లి పాత్ర పోషించిన నటి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పేరు శాంతి అయినప్పటికీ.. ఇండస్ట్రీలో అడుగుపెట్టాక నిర్మలగా మార్చుకుంది. అప్పట్లో ఈమె క్రేజీ హీరోయిన్.ఈమె తమిళనాడు కి చెందిన అమ్మాయి అయినప్పటికీ.. తమిళ్ తో పాటు.. మలయాళం, తెలుగు, కన్నడ.. భాషల్లో కలిపి 200లకు పైగా సినిమాల్లో నటించింది.అయితే.. తమిళ దర్శకుడు శ్రీ సి.వి.శ్రీధర్ డైరెక్షన్లో తెరకెక్కిన “వెన్నిరాడై” చిత్రం సూపర్ హిట్ అయ్యి.. ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టిందట.
అందుకే.. అప్పటి నుండీ ఈమెను ‘వెన్నిరాడై నిర్మల’ అని పిలుస్తుంటారట. నిర్మల తమిళనాడులోని కుంభకోణం అనే ప్రాంతంలో 1948 జూన్ 28న జన్మించింది. చిన్నప్పటి నుండే నిర్మలకు నాటకాలు మరియు నాట్యం పై ఆసక్తి ఎక్కువగా ఉండేదట. అందుకే నిర్మల తల్లిదండ్రులు.. ఈమెకు భరత నాట్యంలో శిక్షణ కూడా ఇప్పించారట. దేశం మొత్తం ఈమె ప్రదర్శనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సినిమాల్లో కూడా బాగా సక్సెస్ అయ్యింది. అయితే ఈమె పెళ్లి మాత్రం చేసుకోలేదట.
దానికి ప్రధాన కారణం.. ఈమె అప్పట్లోనే ఓ తమిళ హీరోని ప్రేమించిందట. కానీ అది పెళ్లి వరకూ వెళ్ళలేదు. అందుకే ఈమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని తెలుస్తుంది. అసలు ఎటువంటి వేడుకలకు ఈమె ఎక్కువగా రాదు. సోషల్ మీడియాకు కూడా ఈమె దూరంగా ఉంటుంది. అందుకే ఈ విషయం ఇప్పటి వరకూ బయటకు రాలేదని ఆమె సన్నిహిత వర్గాల నుండీ సమాచారం.
Most Recommended Video
15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!