బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 చివరి దశకి చేరుకుంది. ఈ టైమ్ లో బిగ్ బాస్ టీమ్ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ని , నాన్స్ సెన్స్ ని చూసి విసికిపోయి ఆఖరికి వీడియోని రివీల్ చేసింది. గత కొద్ది వారాలుగా రేవంత్ కి ఇంకా ఆదిరెడ్డికి ఒకే విషయంపై తెగ ఆర్గ్యూమెంట్స్ జరుగుతున్నాయి. గతవారం నామినేషన్స్ లో కూడా ఆదిరెడ్డి ఒక పది సంవత్సరాల తర్వాత అయినా సరే నేను ఇదే మాట మీద ఉంటాను అంటూ రేవంత్ అన్నమాటలని గుర్తు చేశాడు. రేవంత్ ని ఒప్పుకోమని చెప్పాడు.
అసలు ఏం జరిగిందనేది మనం ఒక్కసారి చూస్తే., బిబి ట్రాన్స్ పోర్ట్ టాస్క్ లో శ్రీహాన్ – శ్రీసత్య ఇద్దరూ ఉన్నప్పుడు ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఒకరిని టాస్క్ లో ముందుకు తీస్కుని వెళ్లాలి అనేది ఏకాభిప్రాయంతో నిర్ణయిస్తున్నారు. ఇందులో రేవంత్, రోహిత్, ఇంకా ఆదిరెడ్డి ముగ్గురు మద్యలో మాటలు కలిశాయి. ఇక్కడే రేవంత్ అమ్మాయిని తీస్కుంటే టాస్క్ లో మనంకి అడ్వాంటేజ్ అవుతుందని అన్నాడు. ఈజీ అవుతుందని ఆలోచించమని చెప్పాడు. వెంటనే ఆదిరెడ్డి శ్రీహాన్ ని తీస్కుందామని తన పాయింట్ పెట్టాడు. ఆ పాయింట్ కి రేవంత్ ఓకే అని చెప్పాడు.
కానీ, తర్వాత ఆదిరెడ్డి రేవంత్ అమ్మాయిలు వీక్ కాబట్టి ఈజీగా గెలవచ్చని ఆరోజు నువ్వు శ్రీసత్యని తీస్కోమని చెప్పావని చెప్తూ ఇసుక బస్తాల టాస్క్ లో (లాగ్ టాస్క్ లో ) ఫైమాకి సపోర్ట్ చేశాడు. అక్కడ్నుంచీ ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. ఆ తర్వాత ఆదిరెడ్డి ఎవిక్షన్ ప్రీపాస్ టాస్క్ అడనని చెప్పినందుకు, రేవంత్ కి ఈ రీజన్ చెప్పినందుకు నాగార్జున వీకండ్ ఫుల్ క్లాస్ పీకారు. అంతేకాదు, గమీదా అంటూ గట్టుమీదదాస్ స్టోరీ చెప్పారు. దీంతో ఆదిరెడ్డి తర్వాత వారం నామినేషన్స్ వేస్తూ రేవంత్ పై రెచ్చిపోయాడు.
ఇక దీనికి ఈవారం ఫుల్ క్లారిటీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. అసలు తెర వెనుక ఏం జరిగిందంటే., ఆదిరెడ్డి అంతకు ముందు నువ్వు అలాగే మాట్లాడావ్ అంటూ రేవంత్ ని నిందిస్తునే బిగ్ బాస్ ఆ ముక్క మాత్రమే కట్ చేసి చూపించిందని, ఫుల్ వీడియో వేస్తే నాకు ప్లస్ అవుతుందని పదే పదే చెప్పాడు. అంతేకాదు, వీడియోలో ముందు నువ్వు ఫస్ట్ మాట్లాడవని కూడా చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో ఆదిరెడ్డి ఫాలోవర్స్, ఫ్యాన్స్ రెచ్చిపోయారు.
ఆదిరెడ్డిని తొక్కేస్తున్నారని, కామన్ మ్యాన్ ని వేరేలా, సెలబ్రిటీలని వేరేలా చూస్తున్నారని బిగ్ బాస్ నిర్వాహకులపై రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. అంతేకాదు, నాగార్జున పైన కూడా ట్రోలింగ్స్ వచ్చాయి. దీంతో బిగ్ బాస్ మేనేజ్మెంట్ దీనిని చాలా సీరియస్ గా తీస్కున్నట్లుగా సమాచారం. అందుకే, సందర్భం లేకపోయినా కూడా ఆదిరెడ్డికి , మిగతా హౌస్ మేట్స్ కి, అలాగే ఆడియన్స్ కి క్లారిటీ ఇస్తూ ఫుల్ వీడియో హౌస్ లో చూపించారు. హౌస్ మేట్స్ ఓపీనియన్ కూడా అడిగారు. అయినా కూడా ఆదిరెడ్డి నాగార్జునతో వాదిస్తునే ఉన్నాడు.
దీంతో ఆదిరెడ్డి ఇంకా తక్కువ అయిపోతున్నావ్ దీనివల్ల అంటూ నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆడియన్స్ కూడా ఆదిరెడ్డి చెప్పిన రీజన్ కి, రేవంత్ మాట్లాడిన మాటలకి పొంతన లేదని తేల్చిచెప్పారు. అంతేకాదు, ఎవిక్షన్ ఫ్రీపాస్ వాడితే ఓట్లు రావని చెప్పావ్ అని, మరి సన్నీకి ఎలా ఓట్లు వచ్చి విన్నర్ అయ్యాడని ప్రశ్నించాడు నాగార్జున. దీనికి ఆదిరెడ్డి సారీ చెప్పాడు. కానీ, రేవంత్ విషయంలో మాత్రం తను పట్టిన కుందేలుకి మూడేకాళ్లు అంటూ వాదిస్తునే ఉన్నాడు. మరి దీనిపైన ఆదిరెడ్డి ఫాలోవర్స్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!