టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు నటిగా కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరనే సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను డ్యాన్సర్ గా ఎదగాలని అమ్మ కూచిపూడి, భరతనాట్యం నేర్పించిందని రమ్యకృష్ణ వెల్లడించారు. సినిమాల్లోకి రావడం ద్వారా గుర్తింపు వస్తుందని భావించి ఈ రంగంలోకి వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలే నా ప్రపంచం అయ్యాయని ఆమె పేర్కొన్నారు.
ఖాళీ సమయం దొరికితే కొడుకు రిత్విక్ తో గడపటానికి ప్రాధాన్యత ఇస్తానని ఆమె కామెంట్లు చేశారు. ఖాళీ సమయం దొరికితే ఇంకొంచెం ఎక్కువగా వర్కౌట్లు చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు. రిత్విక్ నా సినిమాలను చూడటంతో పాటు నా నటనపై నెగిటివ్ కామెంట్లు చేస్తాడని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. కృష్ణవంశీ డైరెక్షన్ లో పెళ్లికి ముందు చంద్రలేఖ మూవీలో చేశానని పెళ్లైన తర్వాత శ్రీ ఆంజనేయం మూవీలో చేశానని తెలిపారు.
నరసింహ మూవీలోని నీలాంబరి రోల్ నాకు గుర్తింపు తెచ్చిన రోల్స్ లో ఒకటని ఆమె కామెంట్లు చేశారు. అమ్మోరు మూవీ రిలీజైన సమయంలో ఒక మూవీ షూటింగ్ లో పాల్గొనగా కొంతమంది మహిళలు వచ్చి నా కాళ్లకు దణ్ణం పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మోరు మూవీ రమ్యకృష్ణ కెరీర్ లో ఆమెకు ఎంతో ప్రత్యేకమని సమాచారం. రాఘవేంద్రరావు గారి సినిమాతో తెలుగులో సక్సెస్ దక్కిందని కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాతో తమిళంలో సక్సెస్ దక్కిందని ఆమె కామెంట్లు చేశారు.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నాకు ఆదర్శమని రమ్యకృష్ణ కామెంట్లు చేశారు. రమ్యకృష్ణ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రమ్యకృష్ణ రోజుకు 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!