“భరత్ అనే నేను” సినిమాలో కియారాను చూసిన యూత్ అందరూ మనసు పారేసుకుంటే.. దర్సకనిర్మాతలందరూ సూట్ కేసులు పారేసుకున్నారు. దెబ్బకి అమ్మడు పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయారు జనాలు. వెంటనే చరణ్ సినిమా సైన్ చేసిన కియారాకు “వినయ విధేయ రామ” పెద్ద బిస్కెట్ అవ్వడంతో మళ్ళీ తెలుగులో ఇంకో సినిమా సైన్ చేయలేదు. అయితే.. మొదటి నుండీ అగ్ర తాంబూలం ఎప్పుడూ బాలీవుడ్ కె ఇస్తూ వస్తున్న కియారా..
బాలీవుడ్ ఈజ్ లైఫ్ అనుకోని అక్కడే వరుస సినిమాలు సైన్ చేస్తూ బీజీయస్ట్ హీరోయిన్ అయిపొయింది. అయితే.. ఆమె హిందీ సినిమాల లిస్ట్ చూస్తే మాత్రం ఖంగుతినాల్సిందే. ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. నటించిన పెద్ద సినిమాల్లో కూడా ఆమెది సెకండ్ లీడ్ రోల్. ఈమాత్రం దానికోసమా తెలుగు సినిమాలను వదులుకొంది అనిపిస్తుంది. ఇక రీసెంట్ గా విడుదలైన “ఇందూ కి జవానీ” సినిమా మాత్రం బీగ్రేడ్ సినిమా స్థాయిలో ఉంది.
ఒన్ నైట్ స్టాండ్ కోసం పరితపించే ఓ యువతిగా కియారా నటించింది. ఆమె స్టార్ డమ్ కి, సినిమా కాన్సెప్ట్ కి ఏమాత్రం సింక్ అవ్వలేదు. పైగా.. ఆడియన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆమె చేతిలో ప్రస్తుతం బోలెడు సినిమాలున్నప్పటికీ.. ఇలా వరుస పరాజయాలు, బీ గ్రేడ్ స్టఫ్ కథలు సెలక్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం కెరీర్ కి గండిపడడం ఖాయం.