Prashanthi: గృహాలక్ష్మీ సీరియల్ నటి డాన్స్ వీడియోల పై సెటైర్లు!

ఒకప్పుడు యాంకర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రశాంతి (Prashanthi) ..పోటీలో నెగ్గుకు రాలేక నటి అయిపోయింది. సినిమాల్లో అవకాశాల కోసం ఈమె గట్టిగానే కష్టపడింది. కానీ దర్శకనిర్మాతలు ఈమె ట్యాలెంట్ ను గుర్తించలేదు.’కలర్ లేవు కదా నీకు నటి అయ్యే యోగం లేదు’ అంటూ ఈమెను విమర్శించేవారట. అయినప్పటికీ ఈమె కష్టపడి నటి అవ్వగలిగింది. పలు సినిమాల్లో నటించి కొన్నాళ్ళు బిజీగా గడిపిన ఈ అమ్మడు.. ఓ సినిమాలో లెస్బియన్ పాత్ర కూడా వేసింది.

ఆమె బోల్డ్ నెస్ కు మెచ్చి సినిమాల్లో కాకపోయినా సీరియల్స్ లో అవకాశాలు వస్తున్నాయి. ప్రశాంతిలో మంచి నటి ఉందని ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ చాటి చెప్పింది. ఈ సీరియల్లో ఆమె లేడీ విలన్ లాస్యగా బాగా నటిస్తుంది. ఈమె కన్నింగ్ లుక్స్ ఒకప్పటి సినిమాల్లో లేడీ విలన్లను గుర్తుచేస్తుంటాయి. ‘కార్తీక దీపం’ సీరియల్లో మౌనిత పాత్ర ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో.. ఈ సీరియల్లో ప్రశాంతి పాత్ర కూడా అంతే ఇంపాక్ట్ అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఓ పక్క గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూనే మరోపక్క రీల్స్ కూడా చేసి హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది. తాజాగా ఈమె చేసిన ఓ రీల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో మాస్ స్టెప్పులతో రచ్చ చేసింది ప్రశాంతి. ఈ వీడియో చూసిన ఆమె ఫాలోవర్స్ .. ‘మీ నడుముకి పెద్ద ఫ్యాన్’ ‘కాస్త మేకప్ తగ్గించండి’ అంటూ కామెంట్ పెట్టాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus