Adipurush: నెల దాటినా ఆదిపురుష్ పై విమర్శలు ఆగడం లేదుగా!

  • July 15, 2023 / 09:02 PM IST

ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నష్టాలే మిగిల్చింది. నార్త్ లో కూడా పెద్దగా లాభాలు రాలేదు. అయితే ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ వల్ల భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ట్రోలింగ్ ఎక్కువగా జరిగినా.. దాని దెబ్బ తట్టుకుంటూ రూ.400 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాటలు కాదు. ఆ ఫీట్ ను ఆదిపురుష్ సాధించింది. ఈ సినిమా రన్ ముగిసినా ..

ఈరోజు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతూ ట్రెండింగ్ లో నిలిచింది ఆదిపురుష్. శుక్రవారం నాడు “చంద్రయాన్ 3” బాగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. మనదేశానికి చెందిన గొప్ప అంతరిక్ష సంస్థ …ఇస్రో.. శుక్రవారం నాడు చంద్రయాన్ – 3 (చంద్రుడిపై చేసే ప్రయోగాల కోసం పంపే రోవర్) ను సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది. 40 రోజుల్లో అది చంద్రుడిపైకి చేరుతుంది.ఇలాంటి ప్రయోగాలు కోసం అమెరికా, రష్యా వంటి దేశాలు వందల మిలియన్ల ఖర్చు చేస్తాయి..

అయితే ఇస్రో మాత్రం ‘చంద్రయాన్ -3’ కోసం రూ. 615 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అయితే దీనికి , ‘ఆదిపురుష్’ కి లింక్ ఏంటి అని మీకు అనిపించొచ్చు. విషయం ఏంటి అంటే ‘ చంద్రయాన్ 3 ‘ కంటే కూడా “ఆదిపురుష్” సినిమాకే దర్శకుడు ఓం రౌత్ ఎక్కువ ఖర్చు పెట్టించాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంలో భారతీయ శాస్త్రవేత్తలు గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి  (Adipurush)  ఆదిపురుష్ కి అందులో సగం బడ్జెట్ మాత్రమే పెట్టారు. అయినా ఓం వెలగబెట్టింది ఏమీ లేదనేది వారి ఉద్దేశం.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus