దాదాపు 3 నెలలుగా లాక్ డౌన్ వల్ల షూటింగ్లు క్యాన్సిల్ అయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో ‘జబర్దస్త్’ వంటి షో లకు బాగా కలిసొచ్చింది. ఎట్టకేలకు ఇటీవల ‘జబర్దస్త్’ షూటింగ్ మొదలైంది. అనసూయనే షూటింగ్ స్పాట్ పిక్ ఒకటి పెట్టి ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఈ పిక్ లో అనసూయ లుక్ చాలా కొత్తగా ఉంది. బహుశా ఇప్పటివరకూ అనసూయను ఇలా చూసుండరు. భుజాల వరకూ తన జుట్టును కట్ చేసి… దానిని రింగ్ లు తిప్పి, బ్రౌన్ కలర్ వేసుకుంది.
హెయిర్ స్టైల్‌కు మ్యాచ్ అయ్యేలా లిప్ స్టిక్ వేసుకోవడంతో అచ్చం ఇంగ్లిష్ అమ్మాయిలానే ఉందని చెప్పాలి. ‘తెలుగింటి ఆడవాళ్లు తలుచుకుంటే.. ఇంగ్లీష్ అమ్మాయిల కంటే కూడా అందంగా కనిపిస్తారు’ అనే మీనింగ్ వచ్చేలా ఓ కామెంట్ కూడా విసిరింది అనసూయ. ఇదిలా ఉంటే అనసూయ కొత్త లుక్ పై ఓ పక్క ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ‘ఈమె అనసూయ? నేనింకా జేమ్స్ బాండ్ హీరోయిన్ అనుకున్నానే అంటూ మీమ్స్ కూడా చేస్తున్నారు.
కొందరు.ఇక అనసూయలో ఇంత కొత్త మార్పు రావడానికి సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ సచిన్ డకోజి పనితనం అని తెలుస్తుంది. ఆయన అనసూయకు హెయిర్ స్టైలింగ్ చేస్తుండగా వీడియో తీసి.. దానిని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. ‘కొత్త కొత్తగా రెడీ అవ్వడం తనకు చాలా ఇష్టమని… తనను ఇలా కొత్త లుక్‌లో చూపించినందుకు సచిన్ డకోజికి కృతజ్ఞలు’ అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.