మొన్న కాజల్… ఇప్పుడు నోరా.. !

మొన్నటికి మొన్న కాజల్ నటించిన ‘పారిస్ పారిస్’ చిత్ర ట్రైలర్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ బ్యూటీ కంగనా నటించిన సూపర్ హిట్ చిత్రం క్వీన్ కి ఇది రీమేక్. ఈ ట్రైలర్ కాజల్ ని ఒక అమ్మాయి బ్రెస్ట్ పై ప్రెస్ చేసే సీన్ చాలా వల్గర్ గా ఉందంటూ.. కాజల్ ఫ్యాన్స్ తో పాటూ చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేసారు. తరువాత డైరెక్టర్ గా వచ్చి దీని పై క్లారిటీ ఇచ్చే వరకూ.. ఈ విషయాన్ని వదల్లేదు నెటిజెన్స్. ఇక కాజల్ తరువాత.. తాజాగా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యింది నోరా ఫతేహి.

అసలు ఎవరు ఈ నోరా ఫతేహి అనేగా మీ డౌట్ ? గతంలో పూరి జగన్నాధ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘టెంపర్’ చిత్రంలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అలాగే ‘బాహుబలి: ది బిగినింగ్ ‘ లో ‘మనోహరి’ వంటి ఐటెం సాంగ్స్ లో నర్తించింది. స్వతహాగా కెనడియన్ అయినప్పటికీ బాలీవుడ్ లో హాట్ ఐటెం బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ భామకు మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టమట. ఇటీవల ముంబైలో ఉమంగ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం జరిగింది. ముంబై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం అన్నమాట..! ఈ ఈవెంట్ లో నోరా తన ఫేవరెట్ మధురిని కలిసింది. మాధురిని కలవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. ఇందులో పెద్ద న్యూస్ ఏముంది అనేగా మీ డౌట్..! విషయంలోకి వెళితే… మాధురి దీక్షిత్ ని కలిసిన హడావుడిలో నోరా… మాధురి భుజం పై చెయ్యి వేయబోయి… బ్రెస్ట్ పై చెయ్యేసినట్టుంది. అంతే ఇక ట్రోలింగ్ షురూ ..! దీని పై కొందరు నెటిజెన్ల రకరకాల కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus