పాలిటిక్స్ విషయంలో మెగాస్టార్ పై దారుణమైన ట్రోలింగ్!

సినిమాల్లో మకుటం లేని మహారాజు మన మెగాస్టార్ చిరంజీవి. విశేషమైన ప్రజాభిమానం, అశేషమైన స్టార్ ఇమేజ్ కలిగిన చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జీరోగా మిగిలిపోయాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఒండిపోయినప్పుడు కూడా చిరంజీవిని ఎవరూ గేలి చేయలేదు. అలాంటిది ఆయన పార్టీనీ కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు మాత్రం అందరూ ఆయన్ని ఎగతాళి చేశారు. అప్పట్నుంచి చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండడం లేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు తప్పితే రాజకీయాల్లో మాత్రం అస్సలు ఇన్వాల్వ్ అవ్వడం లేదు.

గత ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రచారం కూడా చేయలేదు. దాంతో చిరంజీవి రాజకీయ సన్యాసం తీసుకొన్నాడేమో అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అయితే.. “సైరా” ప్రమోషన్స్ భాగంగా ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. దానికో రీజన్‌ ఉంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి చిరంజీవి ఓ సలహా ఇచ్చారు. అదేంటంటే. మీరు రాజకీయాల నుంచి తప్పుకొండి. పార్టీ పెట్టొద్దు..ఎన్నికల్లో పాల్గొనవద్దు. ఇది మెగాస్టార్‌ గారు సూపర్‌స్టార్‌కి ఇచ్చిన అడ్వైజ్‌. మరి అదే సలహా తమ్ముడికి ఇవ్వలేకపోయావా అని చిరంజీవి ఎద్దేవా చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus