రాహుల్ రవీంద్రన్ ను వీడని మన్మధుడు 2 కష్టాలు

చిలసౌ” సినిమాతో దర్శకుడిగా మారి తన ప్రతిభను ఘనంగా చాటుకొన్న రాహుల్ రవీంద్రన్ కు ద్వితీయ విఘ్నం కారణంగా “మన్మధుడు 2″తో సరైన హిట్ అందుకోలేకపోయాడు. దాంతో “చిలసౌ” టైమ్ లో రాహుల్ రవీంద్రన్ ను మెచ్చుకొన్నవాళ్ళందరూ.. “మన్మధుడు 2” రిలీజ్ తర్వాత కనీసం పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా “మన్మధుడు 2” అనే టైటిల్ పెట్టి నాగార్జున క్యారెక్టర్ ను మరీ అంత ఘోరంగా చూపించడాన్ని నాగార్జున ఫ్యాన్స్ కూడా తట్టుకోలేకపోయారు. అయితే.. ఈ ఆన్లైన్ ట్రోలింగ్ కు బాగా అలవాటుపడిన రాహుల్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

అయితే.. నాగ్ ఫ్యాన్స్ తోపాటు జనరల్ ఆడియన్స్ కూడా “మన్మధుడు 2” గాయాన్ని మర్చిపోతున్న తరుణంలో.. పుండు మీద కారం జల్లినట్లు రాహుల్ రవీంద్రన్ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో “మన్మథుడు 2 నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతుంది అందరూ చూడండి” అని పోస్ట్ చేయడం నెటిజన్లను రెచ్చగొట్టింది. అదో అద్భుత కళా ఖండం దాన్ని మేము చూడాలా , మా నాగార్జున కు చెత్త సినిమా ఇచ్చావ్ అంటూ రాహుల్ ఫై విరుచుకుపడుతున్నారు. మరి సోషల్ మీడియాలో ఇంత నెగిటివిటీ ఫేస్ చేస్తున్న రాహుల్ రవీంద్రన్ కు మూడో సినిమా ఎప్పుడు ఒకే అవుతుందో చూడాలి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus