Bigg Boss 7 Telugu: సీక్రెట్ రూమ్ నుంచీ వస్తూ రెచ్చిపోయిన గౌతమ్..! ట్రోల్ చేస్తున్న ఆడియన్స్..!

బిగ్ బాస్ హౌస్ లో చాలాసార్లు ఫేక్ ఎలిమినేషన్ అయినవాళ్లు సీక్రెట్ రూమ్ కి వెళ్తారు. అన్ని సీజన్స్ లో దాదాపుగా ఇది జరిగింది. అయితే, ఈ సీజన్ లో పోటుగాళ్లు ఎంట్రీ జరిగిన వారంలోనే గౌతమ్ ని ఎలిమినేట్ చేస్తూ సీక్రెట్ రూమ్ లో పెట్టారు. సీక్రెట్ రూమ్ నుంచీ సరిగ్గా గౌతమ్ నామినేషన్స్ రోజున బయటకి వచ్చాడు. వస్తూనే గంభీరంగా అశ్వత్థామకి చావే లేదు అంటూ డైలాగ్స్ చెప్తూ వచ్చాడు.

అశ్వత్థామ గౌతమ్ మళ్లీ పునర్జన్మ ఇది.. 2.ఓ అంటూ ఆవేశ పడిపోయాడు. అంతేకాదు, చాలామంది పోట్లు పొడిచారని అయినా నాకు ఏం కాలేదంటూ మాట్లాడాడు. ఇక్కడే శివాజీని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయాడు. దీంతో శివాజీ కూల్ గా గౌతమ్ కి ఆన్సర్ ఇచ్చాడు. నువ్వు రావడం మాకు హ్యాపీగానే ఉంది అంటూ మాట్లాడాడు. అలాగే ప్రియాంక కూడా ఇదే విషయం చెప్పింది. దీంతో పాయింట్ లేకుండా ఆర్గ్యూమెంట్ పెట్టుకుంటూ గౌతమ్ బకరా అయిపోయాడని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

హౌస్ లో ఎంటర్ టైన్ చేయడం అంటే ప్యాంట్ వేస్కోకుండా ఉండటమా అంటూ శివాజీపై కౌంటర్ వేశాడు గౌతమ్. దీనికి ఆడియన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అశ్వత్థామగా నువ్వు ఎంట్రీ ఇస్తే హౌస్ లో శివాజీ శ్రీకృష్ణుడు బామ్మర్ధి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు, శివాజీని ఎదిరించాలంటే బలమైన పాయింట్ పట్టుకోవాలని, సిల్లీగా ప్యాంట్ నిక్కర్ అంటూ మాట్లాడతావేంటని కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు కొత్తగా వచ్చిన పోటుగాళ్ల లిస్ట్ లో గౌతమ్ ని చేర్చాడు (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్. ఆటగాళ్ల తరపున కాకుండా పోటుగాళ్ల తరపున ఉంటావని చెప్పాడు.

సీక్రెట్ రూమ్ కి వెళ్లి తిరిగి వచ్చిన ఉత్సాహంతో గౌతమ్ రెండు టాస్క్ లు ఆడి విజయం సాధించాడు. అంతేకాదు, తను చూసిన వీడియోల గురించి అలాగే వేరేవాళ్లు అన్న పాయింట్స్ గురించి కూడా మాట్లాడాడు. శివాజీనే టార్గెట్ గా గౌతమ్ వచ్చాడని అలాగే పల్లవి ప్రశాంత్ ఇంటి కెప్టెన్ అయినా కూడా పట్టించుకోలేదని ఎందుకంటే, తనని ఇంట్లో నుంచీ వెళ్లిపోమని ఆరుగురు ఓట్లు వేశారని చెప్పాడు గౌతమ్. తనకి ఓటు వేయని సందీప్ ని నామినేషన్స్ నుంచీ సేఫ్ చేసిన సంగతి తెలిసిందే.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus