ప్రభాస్ లుక్స్ పై మళ్ళీ మొదలైన ట్రోలింగ్

సాహో సినిమా హిట్టా, ఫ్లాపా అనే విషయం పక్కన పెడితే.. ఆ సినిమాలో ప్రభాస్ లుక్స్ కి మాత్రం విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. సినిమాలో ప్రభాస్ మరీ లావుగా కనిపించాడని, లుక్స్ పరంగా కూడా పెద్దగా జాగ్రత్త తీసుకోలేదని ప్రభాస్ అభిమానులు కూడా బాధపడిన సందర్భాలున్నాయి. అయితే.. ఆ కామెంట్స్ ను పాజిటివ్ గా తీసుకొన్న ప్రభాస్ “జాన్” సినిమా కోసం సన్నబడుతున్నాడని, లుక్స్ విషయంలో కూడా సరికొత్తగా కనిపించే ప్రయత్నంలో ఉన్నాడని ఒక నెల రోజుల క్రితం వార్తలొచ్చాయి. కానీ.. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ప్రభాస్ సన్నబడడం పక్కన పెడితే.. ఇంకాస్త బల్క్ గా తయారయ్యాడని తెలిసొచ్చింది.

దిల్ రాజు బ్యానర్ లో పార్ట్నర్ అయిన లక్ష్మణ్ కొడుకు వివాహానికి హాజరైన ప్రభాస్ ను చూసినవాళ్ళందరూ షాక్ అయ్యారు. నీట్ గా టక్ చేసుకొని స్టైలిష్ గానే కనిపించినప్పటికీ.. సాహో సినిమాలో కంటే కాస్త లావుగా కనిపించాడు ప్రభాస్. దాంతో ఇంకెప్పుడు తగ్గుతావ్ ప్రభాస్ అని కామెంట్ చేయడం మొదలెట్టారు కొందరు నెటిజన్లు. వాళ్ళు, వీళ్ళు కామెంట్ చేస్తున్నారని కాకపోయినా.. ప్రభాస్ అర్జెంట్ గా సన్నబడితే బాగుంటుంది.

1

2

3

4

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus