టీజర్లు, ట్రైలర్లు, వీడియో-ఆడియో సాంగ్స్ విడుదలను సినిమా పబ్లిసిటీ కోసం కంటే రికార్డుల కోసం అన్నట్లుగా కన్సిడర్ చేస్తున్నారు ఈమధ్య ఫ్యాన్స్. ఫ్యాన్స్ ఈగోలను సాటిస్ఫై చేయడం కోసం హీరోలు, దర్శకనిర్మాతలు కూడా ఈ రొచ్చులోకి దిగుతున్నారు. మా సినిమాకి కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి అని ఒక నిర్మాత చెప్పుకొన్నాడంటే అది అతను తన విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పుకొంటున్నట్లు కాబట్టి సరే అనొచ్చు. కానీ.. మా సినిమా టీజర్ ను ఇన్ని నిమిషాల్లో ఎన్ని లక్షల మంది చూశారు.. ఇన్ని గంటల్లో ఇన్నేసి వ్యూస్ వచ్చాయి అని రొమ్ములు విరిచి చెప్పుకొంటుండడం వలన ఒరిగేది ఏమిటి అనేది ఎవరికీ అర్ధం కానీ, అంతుబట్టని విషయం.
పోనీ ఈ వ్యూస్ ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా అంటే కాదు.. లక్షలు పోసి మరీ కొంటున్నారు. ఆ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కంటే వీళ్ళు ఆ వ్యూస్ కోసం తగలేసేదే ఎక్కువ. ఈ కారణంగా హీరోల ఫ్యాన్స్ ఫాల్స్ ప్రెస్టేజ్ ఏమైనా పెరుగుతుందేమో కానీ.. సినిమాకి ఎలాంటి లాభం ఉండదు. ఈ సినిమా టీజర్/ట్రైలర్ కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి కాబట్టి ఈ సినిమాకి వెళ్ళాలి అని ప్రేక్షకుడు ఎప్పుడూ అనుకోడు. ప్రేక్షకుడిని ఎగ్జైట్ చేసే కంటెంట్ సదరు టీజర్/ట్రైలర్ లో ఉందా లేదా అనేది మాత్రం అతడికి కావాల్సింది. కానీ.. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు గాలికొస్తున్నారు. మరి ఈ డిజిటల్ పందాల్లో గెలవడం కోసం అనవసర ప్రయాసలు మాని.. సినిమాని సినిమాలా ప్రమోట్ చేసి జనాలకి చేరువ చేసి.. వాళ్ళని థియేటర్లకి రప్పించి ఒక నిర్మాత ఎప్పటికీ నిజమైన విజయాన్ని అందుకుంటాడో.
24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!