‘డేంజరస్’ : సంచలనం రేపుతున్న జబ్ సే పాట..!

నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు బాగా ఇష్టం. గతంలో పాత్ బ్రేక్ సినిమాలను అందించిన వర్మ.. బాలీవుడ్ ను కూడా ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ‘రక్త చరిత్ర’ వరకు వర్మ.. మంచి సినిమాలే తీశాడు. కానీ ఆ తర్వాత నుండీ ‘వరస్ట్ ను మించి వరస్ట్’ అన్నట్టు సినిమాలు చేస్తున్నాడు. గతంలో జయాపజయాలతో సంబంధం లేకుండా అతని సినిమాలకు డబ్బులు వచ్చేవి. కాంట్రవర్సీని మిక్స్ చేసి ప్రమోషన్స్ చేస్తుంటాడు కాబట్టి.. జనాలు ఆకర్షితులై థియేటర్లకు వచ్చేవారు..

అలా ఓపెనింగ్స్ తోనే బయ్యర్లు గట్టెక్కేసేవారు. కానీ ఇటీవల కాలంలో వర్మ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్ల వరకు రావడం లేదు. ఈ విషయాన్ని త్వరగానే పసిగట్టిన వర్మ ఓటిటి బాట పట్టాడు. గత ఏడాది వచ్చిన ‘క్లైమాక్స్’ ‘నగ్నం’ ‘థ్రిల్లర్’ వంటి సినిమాలు చూస్తే వర్మ ఎంత దిగజారిపోయారు అన్న విషయం స్పష్టమవుతోంది అంటూ చాలా మంది విశ్లేషకులు కామెంట్లు చేశారు. ఇప్పుడు ‘అంతకు మించి’ అన్నట్టు ఏకంగా ఇద్దరు అందగత్తెలను పెట్టుకుని వారితో లెస్బియన్ సినిమా చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచాడు వర్మ.

‘డేంజరస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అప్సరా రాణి, నైనా గంగూలీ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండీ ‘జబ్ సే’ అంటూ సాగే ఓ వీడియో సాంగ్ ను కూడా విడుదల చేశారు వర్మ. ‘వర్మ థింగ్స్’.. అంటే హీరోయిన్ల తొడలను వివిధ యాంగిల్స్ లో చూపించడం అలాగే లిప్ లాక్ లు వంటివి ఇందులో ఉన్నాయి. ‘అయితే ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకోవడం.. దాన్ని చూసే దుస్థితి మనకు రావడం.. కరోనా సెకండ్ వేవ్ కంటే ఘోరం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది అయితే ‘ఏందయ్యా వర్మ.. ఇది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus