మరోసారి సమంత పై ట్రోలింగ్ షురూ..!

  • August 28, 2019 / 06:11 PM IST

ట్రోలింగ్ అనేది ఒక్కోసారి ఎంత పెద్ద సెలెబ్రిటీలకైనా తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటారు నెటిజన్లు. ఆ ట్రోలింగ్ కు ఒక్కోసారి ఆ సెలెబ్రిటీలు స్పందిస్తారు… మరికొందరు మండిపడుతుంటారు… మరికొంతమంది అస్సలు పట్టించుకోరనుకోండి. అయితే నెటిజెన్ల పై మండిపడేవాళ్ళు మాత్రం తమ వ్యక్తి గత విషయాల గురించి మాట్లాడటానికి మీకు ఎలాంటి అర్హత లేదు అంటూ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అయితే తమ పర్సనల్ ఫొటోలు జనాలందరితో షేర్ చేసుకునేటప్పుడు మాత్రం హద్దుల్లో ఉండరనేది వారు గ్రహించరా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సమంత విషయంలో అలాంటి సీనే రిపీట్ అయ్యింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలైన తర్వాత ఈమె పై కాస్త ఎక్కువ ఫోకస్ పెరిగిందనే చెప్పాలి. ఆమె కాస్త పొట్టి బట్టలు వేసుకున్నా.. నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అక్కినేని వారింటి కోడలికి పద్దతి తెలీదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలా చాలా సార్లు సమంతను ట్రోల్ చేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు మరోసారి సమంతకు ట్రోలింగ్ తప్పలేదు. తన భర్త నాగచైతన్య మరియు సన్నిహితులతో కలిసి విహారయాత్ర వెళ్ళిన సమంత …. సముద్ర తీర ప్రాంతంలో సేద తీరుతూ ఓ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్త నాగచైతన్యే ఈ ఫోటో తీసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ ఫొటోలో సామ్ డ్రెస్ మరీ చిన్నదిగా ఉండడంతో ఆమె పై నెగెటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. సంప్రదాయం, పద్ధతి… అంటూనే సమంత నీకు సిగ్గులేదా అంటూ ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. ఏదేమైనా ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియా లో తెగ వైరలవుతున్నాయి.

1

2

3

4

5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus