పాపం శ్రీముఖి ని ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు..!

‘బిగ్ బాస్3’ ఫైనల్ కూడా ముగిసింది. చివరి వరకూ టైటిల్ కోసం పరితపించిన శ్రీముఖి.. ‘రన్నర్ అప్’ కి మాత్రమే పరిమితమైంది. హౌస్ లో ఎంటరైన దగ్గర్నుండీ శ్రీముఖి ఎంతో జాగ్రత్తగా ఉంటూ వచ్చింది. టాస్కుల్లో మాత్రం వందకు వంద శాతం శ్రీముఖి బెస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అయినప్పటికీ శ్రీముఖి విన్నర్ కాలేదు. ఇక స్టేజి పై నాగార్జున… రాహుల్ ను విన్నర్ గా ప్రకటించినప్పటి నుండీ శ్రీముఖి ప్రవర్తనలో నెగిటివిటీ బయటపడిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

కనీసం రాహుల్ ను అభినందించడం వంటిది కూడా శ్రీముఖి చేయలేదు. ముఖ్య అతిధిగా విచ్చేసిన చిరంజీవి.. ‘శ్రీముఖి.. రాహుల్ చెక్ గెలుచుకుని ఉండొచ్చు కానీ నువ్వు కోట్ల మంది మనసులు గెలుచుకున్నావ్’ అని ఓదార్చే ప్రయత్నం చేసినా.. ఆమె నార్మల్ మోడ్ కు రాలేకపోయింది. హౌస్ లో ప్రతీ విషయంలో బ్యాలన్స్డ్ గా ప్రవర్తిస్తూ వచ్చిన శ్రీముఖి.. స్టేజి పై మాత్రం బ్యాలెన్చ్ కోల్పోయిందనే చెప్పాలి. ఈ విషయంలో మాత్రం శ్రీముఖిని ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ‘నీ ఫ్రెండ్ గెలిచినా అంత ఏడుపు ఎందుకు?’ ‘హౌస్ లో ఉన్నన్ని రోజులూ ‘ఆర్టిఫిషియల్’ గా ప్రవర్తిస్తూ వచ్చింది. ‘కన్నింగ్ శ్రీముఖి’ అంటూ రక రకాలుగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఫైనల్ ముగిసి రెండు రోజులు పూర్తయినప్పటికీ ఇంకా శ్రీముఖిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus