మాట మార్చిన తమన్నా.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

ఎంత స్టార్ హీరోయిన్ అయినా కొత్త భామలు ఎంట్రీ ఇచ్చి నాలుగైదు హిట్లిచ్చారంటే… స్టార్ హీరోయిన్లను కూడా పక్కన పెట్టేస్తుంటారు దర్శకనిర్మాతలు. ఇలాంటి సమయంలో వారి పోటీని తట్టుకోవడానికి.. స్టార్ హీరోయిన్లు స్కిన్ షో పెంచడానికి కూడా వెనుకాడరు. ఇలా స్కిన్ షో పెంచడం వల్ల ఇక్కడ ఎలా ఉన్నా బాలీవుడ్ నుండీ పిలుపు వచ్చే అవకాశం ఉందనేది వారి ముఖ్య ఉద్దేశం అనే టాక్ ఎప్పటినుండో ఉంది. ఇప్పుడు తమన్నా కూడా ఇదే ఫార్ములా వర్కౌట్ అవ్వాలని తెగ ట్రై చేస్తుంది.

14 ఏళ్ళ తమన్నా కెరీర్లో.. ఇప్పటి వరకూ ఎంత గ్లామర్ షో చేసినా మితిమీరిన గ్లామర్ షో చేయలేదు. గ్లామర్ షో విషయంలో నేను కొన్ని హద్దులు పెట్టుకున్నానని లిప్ లాక్ లకు కూడా నేనంగీకరించను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తమన్నా. అయితే అలా చెప్పిన కొద్ది రోజులకే మాట మార్చేసింది. ఈమె ఓ హీరోతో నటించాల్సి వస్తే లిప్ లాక్ ఇవ్వడానికి కూడా రెడీ అంటుంది. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. ఈయనతో నటించే అవకాశం వస్తే లిప్ లాక్ కు అడ్డుచెప్పను’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ను బట్టి తమన్నా బాలీవుడ్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో ‘హిమ్మత్ వాలా’ రీమేక్ లో చేసినప్పటికీ.. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈమెను అక్కడి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా పూజా హెగ్దే, రష్మిక మందన పోటీ ఎక్కువైంది. ఈ క్రమంలో తమన్నాని దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో ‘యాక్షన్’ సినిమాలో ఓ రేంజ్ లో స్కిన్ షో చేసింది. ఏమైనా తమన్నా మాట మార్చేసిందని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus