షాక్ ఇచ్చిన నితిన్ ‘భీష్మ’ టి.ఆర్.పి రేటింగ్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది కానీ.. బుల్లితెర పై మాత్రం నిరాశపరిచిందనే చెప్పాలి. అక్టోబర్ 18న జీ తెలుగులో ఈ చిత్రం ప్రీమియర్ టెలికాస్ట్ అయ్యింది. మరీ సాయంత్రం 4:30 గంటలకు టెలికాస్ట్ అవ్వడం వలనో ఏమో కానీ.. ‘సాహో’ చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా వీక్షించలేదు. ‘అల వైకుంఠపురములో’ చిత్రం సాధించిన 29.4 టి.ఆర్.పి రేటింగ్ ను ‘సాహో’ బ్రేక్ చేస్తుంది అనుకుంటే అలా జరగలేదు.

ఇక థియేట్రికల్ పరంగా సోలో రిలీజ్ ను దక్కించుకున్న నితిన్ ‘భీష్మ’.. బుల్లితెర పై కూడా సోలో ప్రీమియర్ నే దక్కించుకుంది. దాంతో ఈ చిత్రమైనా ‘అల’ ను బ్రేక్ చేస్తుంది అనుకుంటే ఇది కూడా తుస్సుమంది. దసరా పండుగ రోజున ‘జెమినీ టీవీ’ లో సాయంత్రం 6:30 గంటలకు టెలికాస్ట్ అయిన ‘భీష్మ’ చిత్రం మంచి టి.ఆర్.పి ని నమోదు చేస్తుంది అనుకుంటే.. అలాంటి ఫీట్ ను ఏమి సాధించలేదు. ‘భీష్మ’ చిత్రం మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 6.65 టి.ఆర్.పి రేటింగ్ ను మాత్రమే నమోదు చేసింది. ఇది ‘సాహో’ కంటే బెటర్ రేటింగే అయినప్పటికీ…

పెద్ద ఎత్తున ప్రమోషన్ చెయ్యడం, అది కూడా పండగ రోజున టెలికాస్ట్ అవ్వడంతో.. ఇది చాలా తక్కువ రేటింగ్ అనే చెప్పాలి. ఇక ‘భీష్మ’ చిత్రం శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వారు 8.5 కోట్లకు కొనుగోలు చేశారు. అది మొత్తం రికవర్ అవ్వాలంటే మరో 5సార్లు వారు ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యాల్సిందే. అంతేకాదు అప్పుడు కూడా ఈ చిత్రం ఇలాంటి టి.ఆర్.పి నే నమోదు చెయ్యాల్సి ఉంటుంది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus