ఖరారైన మహేష్, వంశీ సినిమా షెడ్యూల్!

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న రెండో సినిమా భరత్ అనే నేను సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. తమిళనాడులోని పొల్లాచి లో గత నాలుగు రోజులుగా హొలీ నేపథ్యంలో ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీతో పాటు మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక సినిమా కోసం కూడా పనులు దాదాపు పూర్తి అయ్యాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత  డైరక్టర్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రం కోసం డైరక్టర్, డీఓపీ పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లారు. అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు.

లొకేషన్స్ సెట్ కావడంతో పాటు   మ్యూజిక్ పని మొదలు పెట్టారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మూడు ట్యూన్స్ ఫైనల్ చేసినట్లు సమాచారం. అశ్వినీదత్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళుతుందని చిత్ర బృదం వెల్లడించింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఇమ్యానుయేల్, పూజ హెగ్డే పేర్లు వినిపిస్తున్నారు. హీరోయిన్ విషయంలో చిత్ర బృందం ఇంకా నిర్ణయం తీసుకోలేదని టాక్. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus