యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ పనులతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఆచార్య సినిమా ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుండగా ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ తర్వాత సినిమా పనులు మొదలు కానున్నాయి.
2022 సంవత్సరం మార్చి నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అద్భుతమైన మెసేజ్ ఉండేలా కొరటాల శివ ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. పాన్ ఇండియా సినిమాగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా తెరకెక్కనుండగా జనతా గ్యారేజ్ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కొరటాల శివ ఇప్పటివరకు ఐదు సినిమాలకు దర్శకత్వం వహించగా ఆచార్య రిజల్ట్ తేలాల్సి ఉంది. మిగిలిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో కొరటాల శివకు ఉన్న క్రేజ్ వల్ల కూడా సినిమాలకు బిజినెస్ బాగా జరుగుతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. యువసుధా ఆర్ట్స్ బ్యానర్, యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలన్నీ యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే మరో బ్యానర్ తో కలిసి తెరకెక్కనున్నాయని సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి. సాధారణంగా రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీతో ఆ సెంటిమెంట్ బ్రేక్ కావడం గ్యారంటీ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!