వేగంగా సైనా నెహ్వాల్ బయోపిక్ షూటింగ్

సినిమా, రాజకీయం, క్రీడా.. రంగమేదైనా విజయాన్ని సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచినా వ్యక్తుల జీవితాలు వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే ఫిలిం మేకర్స్ బయోపిక్ లపై దృష్టిపెట్టారు. తాజాగా  బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన సైనా నెహ్వాల్ బయోపిక్ జీవితం సినిమాగా రూపుదిద్దుకుంటోంది. అతి తక్కువ వయసులోనే అనేక పతకాలు అందుకున్న సైనా బయోపిక్ ని అమోల్ గుప్తే తెరకెక్కిస్తున్నారు. టీ-సీరీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22 న ప్రారంభం అయింది. సైనా నెహ్వాల్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం నిన్న విడుదల చేసింది. బాడ్మింటన్ రాకెట్ చేతిలో ఉన్న శ్రద్ధ ను చూసి సైనా అని కాసేపు కన్ఫ్యూజ్ అవుతాం.. అంతలా కనిపించింది. అలా కనిపించడం వెనుక మేకప్ ప్రతిభ లేకపోయినప్పటికీ శ్రద్ధా కృషి దాగుందని చిత్ర బృందం తెలిపింది.

“ఈ సినిమా కోసం శ్రద్ధ 40 బాడ్మింటన్ క్లాసెస్ లో పాల్గొంది.  అందులో పొద్దున్నే ఆరుగంటలకు పాల్గొనే సెషన్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రాక్టిస్ సెషన్స్ కష్టం అయినా ఇష్టంగా చేసింది” అని వెల్లడించింది. ఈ సందర్భంగా శ్రద్ధ మాట్లాడుతూ “ఒక స్పోర్ట్స్ పెర్సన్ పాత్ర పోషించడం ఎంతో ఛాలెంజ్ తో కూడుకున్నది. అందులో సైనా ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్. గాయాలవల్ల ఆటకు దూరమయ్యే పరిస్థితి వచ్చినా హార్డ్ వర్క్ తో తను అనుకున్న గోల్స్ సాధించింది” అని పేర్కొంది. ఈ సినిమా తన కెరీర్ లో గొప్ప చిత్రంగా నిలుస్తుందని నమ్ముతోంది. ఈ భామ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సాహో లో ప్రభాస్ కి జోడీగా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో శ్రద్ధ టాప్ హీరోయిన్ స్థానాన్ని కైవశం చేసుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus