Shraddha Srinath: చాలా కలలు ఉన్నాయి… ఏమవుతుందో చూడాలి: శ్రద్ధ శ్రీనాథ్‌

‘మెకానిక్‌ రాకీ’  (Mechanic Rocky) సినిమా గురించి మొన్నీమధ్య వరకు మాట్లాడుకుంటే విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) పేరు మాత్రమే వినిపించేది. అయితే ఆయన ఏ ముహూర్తాన ‘‘ఫలక్‌నుమా దాస్‌’లో (Falaknuma Das)  పాత్ర కోసం శ్రద్ధ శ్రీనాథ్‌ని  (Shraddha Srinath)  అడిగితే నో చెప్పింది’ అని అన్నాడో? అప్పట నుండి ఆమె పేరు కూడా వైరల్‌ అవుతూ వస్తోంది. కారణం ఆ సినిమా హిట్ అవ్వడం, ఈ సినిమాలో ఆమె నటిస్తుండటం. సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రీసెంట్‌గా ఆమె మీడియాతో మాట్లాడింది.

Shraddha Srinath

ఎలాంటి సినిమాని చూడటానికి ఇష్టపడతానో, అలాంటి కథ ఇదీ అనిపించినప్పుడే ఓకే చెబుతా అని తన సినిమాల ఎంపిక వెనుక సీక్రెట్‌ చెప్పింది శ్రద్ధ శ్రీనాథ్‌. విష్వక్‌సేన్‌తో కలిసి నటించడాన్ని ఆస్వాదించానని.. ‘ఫలక్‌నుమా దాస్‌’ సహా మరో రెండు మూడుసార్లు ఆయనతో కలసి నటించే ఛాన్స్‌ వచ్చినా అనుకోని పరిస్థితుల్లో నో చెప్పానని శ్రద్ధ క్లారిటీ ఇచ్చింది.

సినిమా ఓ వ్యాపారం. నేను ఓ బ్రాండ్‌ని మాత్రమే అనుకుంటూ ఉంటాను అని చెప్పిన శ్రద్ధ.. కథ, పాత్రలతోపాటు పారితోషికానికీ ప్రాధాన్యం ఇస్తా అని చాలా క్లారిటీగా చెప్పేసింది. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ‘బాహుబలి’ (Baahubali) లాంటి కథలు, సినిమాలు అంటే ఇష్టమని తన బకెట్‌ లిస్ట్‌ చెప్పకనే చెప్పింది. ఇక తన రూపంలో భారతీయత ఉట్టిపడుతుందని.. అందుకే పీరియాడిక్‌ కథలు, పురాణాల్లోని పాత్రలకి సరిపోతానని భావిస్తున్నా అని కూడా చెప్పింది.

ఆమె విష్‌ లిస్ట్‌ ఇంకా ఆగలేదు. తన కామెడీ టైమింగ్‌ బాగుంటుందని, అందుకే బాగా రాసిన కామెడీ కథలు వస్తే వదిలిపెట్టను అని చెప్పింది. మరి కొత్త సినిమాల మాటేంటి అని అడిగితే.. ప్రస్తుతం బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj)  సినిమాలో నటిస్తున్నానని, తమిళంలో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా అని చెప్పింది. అలాగే విష్ణు విశాల్‌తోనూ (Vishnu Vishal) ఓ సినిమా చేస్తున్నా అని కూడా తెలిపింది. ఈ ఏడాది ప్రథమంలో ‘సైంధవ్‌’తో  (Saindhav) ఇబ్బందికర ఫలితం అందుకున్న శ్రద్ధకు ‘మెకానిక్‌ రాకీ’ ఫలితం చాలా కీలకం అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus