‘జెర్సీ’ అమోఘమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది ! – శ్రద్ధ శ్రీనాథ్

  • April 15, 2019 / 12:03 PM IST

అందంలో అభినయంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలితో దూసుకొస్తోన్న ప్రతిభావంతురాలైన కన్నడ నటి ‘శ్రద్ధ శ్రీనాథ్’. ‘జెర్సీ’ సినిమాలో నాని సరసన నటిస్తూ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది కన్నడ బ్యూటీ. ఇప్పుడు తాజాగా నేచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న ‘జెర్సీ’ సినిమాతో ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాత్రికేయు ల సమావేశంలో సినిమా గురించి తన మాటల్లో …

‘జెర్సీ’ సినిమాకు సంబంధించి తన వర్క్ పట్ల శ్రద్ధ చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాలో తనకు అమోఘమైన భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం రావడం చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో టీనేజర్ గా మరియు ఒక మదర్ గా ఇలా వేరు వేరు దశలలో కనిపిస్తానని తెలిపింది.

ఇక నాని పక్కన నటించడం గురించి చెప్తూ.. నాని సహజ నటుడని, ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఆయన చాలా సింపుల్ వే లో చక్కని హావబావాలతో నటిస్తారని.. ఆయన పక్కన నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని.. అదేవిధంగా ఈ సినిమా ఒప్పుకోవడానికి నానితో పాటుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగ వంశి, అనిరుధ్ లతో మొత్తం చిత్రబృందం కూడా కారణమని.. వారి పనితనం వల్లే ‘జెర్సీ’ సినిమా అమోఘమైన భావోద్వేగాలతో అద్భుతంగా వచ్చిందని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పుకొచ్చింది.కాగా కొన్ని సంవత్సరాలు పాటు హైదరాబాద్ లోనే పెరిగిన శ్రద్ధ.. ఇప్పటికే పలు కన్నడ మరియు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus