“జయమ్ము నిశ్చయమ్మురా” నైజాం హక్కులు సుధాకర్ రెడ్డి సొంతం

ప్రముఖ నిర్మాత, ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పంపిణీదారులు, హీరో నితిన్ తండ్రి శ్రీ సుధాకర్ రెడ్డి “జయమ్ము నిశ్చయమ్మురా” నైజాం హక్కులు సొంతం చేసుకున్నారు.ఈ సందర్భంగా NKR ఫిలింస్ అధినేత, ఈ చిత్రం పూర్తి ప్రదర్శన హక్కుల్ని కైవసం చేసుకున్న నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, “సుధాకర్ రెడ్డి గారు మా చిత్ర నైజాం హక్కుల్ని సొంతం చేసుకోవడం మాకెంతో ఆనందదాయకం. మంచి సినిమాలను ప్రేక్షకులకి చేర్చడంలో ఎప్పుడూ ఆయన ముందుంటారు. వారి శ్రేష్ఠ్ ఫిలింస్ తో కలిసి చేస్తున్న మా నైజాం ప్రయాణాం ఎంతో ప్రోత్సాహవంతంగా ఉంది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి గారికి, నితిన్ గారికి కృతజ్ఞతలు. మా చిత్రం అందుకోబోయే విజయానికి ఇదొక సంకేతంగా భావిస్తున్నాం”, అన్నారు.

మోషన్ పోస్టర్ విడుదల నుంచి, మొన్నటి రంగుల చిలుక పాట నుంచి, నిన్నటి ప్రవీణ్ తత్కాల్ పాత్ర లుక్ వరకు “జయమ్ము నిశ్చయమ్మురా” చిత్రం ఎందరి ప్రశంసలు అందుకుంటోందో చూస్తున్నాం. ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి కథానాయక పాత్రలో కనిపిస్తుండగా, పూర్ణ కథానాయికగా కనిపించనుంది. ముఖ్యపాత్రల్లో పోసాని, కృష్ణభగవాన్, జీవ, ప్రవీణ్ మొదలైనవారు కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శివరాజ్ కనుమూరి తన శివరాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు.

https://www.youtube.com/watch?v=moPFZDJ8r1U

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus