11 భాష‌ల‌కు విస్త‌రిస్తున్న శ్రేయాస్ ఈటీ!

  • August 14, 2020 / 08:28 PM IST

శ్రేయాస్ ఈటీ ఇంట్ర‌డ్యూస్ చేసిన ఏటీటీ (ఎనీ టైమ్ థియేట‌ర్‌) అనే బిజినెస్ మోడ‌ల్ గురించి దేశ‌మంతా ఇవాళ మాట్లాడుకుంటోంది. లాక్‌డౌన్ పీరియ‌డ్‌లో థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయ‌ని ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ నిర్మాత‌ల‌కు ‘పే ప‌ర్ వ్యూ’ అనే మోడ‌ల్ నిజంగా అద్భుతాలు అందిస్తోంది. శ్రేయాస్ ఈటీ ప్ర‌స్తుతం త‌న సేవ‌ల‌ను అన్ని ద‌క్షిణాది భాష‌ల్లో అందిస్తోంది. ఇప్పుడు త‌న కార్య‌క‌లాపాల‌ను ఏకంగా 11 భాష‌ల‌కు విస్త‌రింప‌జేస్తోంది. అప్స‌రా రాణి, రాక్ క‌చ్చి న‌టిస్తోన్న త‌మ‌ త‌దుప‌రి చిత్రం ‘థ్రిల్ల‌ర్‌’ను ఆగ‌స్ట్ 14న మొత్తం 11 భాష‌ల్లో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే రామ్‌గోపాల్ వ‌ర్మ నుంచి వ‌చ్చిన రెండు చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్‌గా భారీ విజ‌యాన్ని సాధించ‌గా, ఆయ‌న నుంచి ఈ ప్లాట్‌ఫామ్‌పై వ‌స్తోన్న మూడో చిత్రం ‘థ్రిల్ల‌ర్’ కోసం ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రం ట్రైల‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావ‌డం దీనికి నిద‌ర్శ‌నం. ఏటీటీ పొటెన్షియాలిటీని రుజువు చేయ‌డానికి శ్రేయాస్ ఈటీ సిద్ధంగా ఉంది. వివిధ భాష‌ల్లో ‘థ్రిల్ల‌ర్‌’ను ప్ర‌మోట్ చేయ‌డానికి వాళ్ల ద‌గ్గ‌ర క‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక‌, వ్యూహం ఉన్నాయి. ద‌స‌రా పండుగ లోపు 50 ఫిలిమ్స్‌ను రిలీజ్ చేయాల‌నేది శ్రేయాస్ ఈటీ ప్రాథ‌మిక ల‌క్ష్యం. హైద‌రాబాద్‌కు చెందిన ఒక కంపెనీకి సంబంధించినంత వ‌ర‌కు ఇది గొప్ప ఘ‌న‌త అని చెప్పాలి. క‌రోనా కాలంలోనూ వారు అల‌స‌ట లేకుండా ప‌నిచేస్తూ, లాక్‌డౌన్‌ను క‌చ్చితంగా ఉప‌యోగించుకుంటున్నారు. మార్చి 2021 లోగా, దేశ‌వ్యాప్తంగా 200 ప్ల‌స్ స్క్రీన్ల‌లో త‌మ కార్య‌క‌లాపాల‌ను విస్త‌రింప జేయాల‌ని శ్రేయాస్ ఈటీ సంక‌ల్పించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus