Shriya, Samantha: ఆమె జీవితంలో ఇది ఒక దశ మాత్రమే.. సమంత పై శ్రియ కామెంట్స్!

  • November 23, 2022 / 04:35 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అతి తక్కువ సమయంలోనే దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించుకున్న నటి సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా ఈమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో ఒక్కసారిగా సినీ సెలెబ్రిటీలు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సమంత వ్యాధి గురించి స్పందించినటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు ఆమె త్వరగా తిరిగి కోలుకోవాలని ఆకాంక్షించారు.

అలాగే సమంత ధైర్య సాహసాలను గుర్తు చేస్తూ ఆమెను ఓదార్చారు. ఇక ఇప్పుడిప్పుడే సమంత తన అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా సమంత బాధపడుతున్నటువంటి మయోసైటిస్ వ్యాధిపై నటి శ్రియ స్పందించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రియ ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రియ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సమంత మయోసైటీస్ వ్యాధి గురించి స్పందించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ సమంత జీవితంలో ఇది ఒక చిన్న దశ మాత్రమే. ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్. తను ఈ రుగ్మతను ఎదిరించి తొందరగా కం బ్యాక్ ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇలా సమంత గురించి శ్రీయ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే శ్రియా సమంత ఇద్దరూ కలిసి మనం సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా ద్వారా వీరిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉందని తెలుస్తోంది. ఇక సమంత ఇప్పుడిప్పుడే మయో సైటీసెస్ వ్యాధి నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఈమె కృష్ణ అంత్యక్రియలలో పాల్గొనడం విశేషం.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus