గౌతమి పుత్ర శాతకర్ణి లో రాణిగా శ్రియ

Ad not loaded.

నటసింహా నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ దశలో ఉండగానే రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. మొరాకోలో జరిగిన మొదటి షెడ్యూల్ షూటింగ్లో హిందీ నటుడు కబీర్ బేడి పాల్గొన్నారు అనగానే టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. జేమ్స్ బ్యాండ్ సినిమాలో విలన్ గా దడ పుట్టించిన నటుడిని తెలుగు సినిమాల్లో పరిచయం చేస్తుండడం, వెయ్యి మంది సైనుకులు, వంద గుర్రాలు, వంద ఒంటెలు చిత్రీకరణలో పాల్గొనడం .. ఇవన్నీ సినిమాకు భారీతనాన్నీ తీసుకొస్తున్నాయని చెప్పుకుంటున్నారు.

లేటెస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రియా శరణ్ ఎంపికయినట్లు తెలిసింది. టాలీవుడ్ లో అగ్ర హీరోలు, యువ హీరోలతో జత కట్టి శ్రియ విజయాలను అందుకుంది. కెరీర్ తొలి నాళ్లలో బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి సినిమాలో కలిసి నటించింది. సరిజోడిగా తెరపై ఆకట్టుకుంది. గౌతమి పుత్ర శాతకర్ణిలో రాణిగా శ్రియ మెప్పించగలదని డైరక్టర్ క్రిష్ భావించి ఆమెను ఖరారు చేశారు. రెండో షెడ్యూల్ కోసం హైదరాబాద్లో ప్రత్యేకంగా రాజ దర్బార్ సెట్ ను వేస్తున్నారు. ఈ చిత్రీకరణలో బాలకృష్ణ తో పాటు శ్రియ పాల్గొననున్నారు. ఇక్కడ సన్నివేశాలను పూర్తి చేసిన వెంటనే పాటలను షూటింగ్ చేసే ఆలోచనలో క్రిష్ ఉన్నారని, అప్పటికే కొన్ని పాటలను అందిచే పనిలో దేవీ శ్రీ ప్రసాద్ ఉన్నట్లు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus