తన పెళ్ళి వార్త పై వ్యంగ్యంగా స్పందించిన శృతీ హాసన్..!

కోలీవుడ్ తో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కుమార్తె ‘శృతీ హాసన్’. గత కొంత కాలంగా శృతికి అవకాశలు తగ్గాయనే సంగతి తెలిసిందే. దానికి ముఖ్య కారణం… శృతి ప్రేమలో ఉందని త్వరలోనే వివాహం చేసుకుంటుందంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరోసారి ప్రేమ వ్యవహారం పై ప్రచారం జోరందుకుంది.

ప్రస్తుతం.. యూరప్‌కు చెందిన మైఖేల్ కోర్సెలేతో ప్రేమలో ఉందని …. మైఖేల్ కూడా ఇండియాకు వచ్చి శృతీ కుటుంబంతో కలిసి చెన్నైలో జరిగిన బంధువుల పెళ్ళికి హాజరయ్యారు. దీంతో వారి ప్రేమ.. పెళ్ళి వరకూ వెళ్ళబోతుందని గతంలో చెన్నై సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.ఈ విషయం పై  శృతి ఖండించింది కూడా..! అయితే శృతీ   ఇటీవల లండన్ వెళ్ళి…. మైఖేల్‌తో కలిసి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోవడం…. అల్లాగే  మైఖేల్‌తో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో శృతీ షేర్ చేయడంతో … మళ్ళీ వీరి ప్రేమ వ్యవహారం ఉపందుకుందనే వార్తలు ఊపందుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ‘2019లో శృతి పెళ్ళిచేసుకోబోతుందంటూ..  ఓ వార్తా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయం పై శృతి ట్విట్టర్ ద్వారా స్పందించింది. శృతీ ఈ విషయం పై స్పందిస్తూ… ‘నిజమా?.. ఇది న్యూసే…’ అంటూ కాస్త వ్యంగ్యంగా స్పందించడం గమనార్హం. శృతీ ఇలా స్పందించడం పై ఆమె అభిమానులు కూడా వ్యంగ్యంగా స్పందిస్తూ కామెంట్లు పెడుతుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus