కాటమరాయుడు సెట్ లో పుట్టినరోజు జరుపుకున్న శృతిహాసన్

విశ్వనటుడు కమలహాసన్ కుమార్తె శృతిహాసన్ తనకంటూ ఓ గుర్తింపును సాధించుకుంది. దక్షణాది టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. తెలుగులో ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడులో నటిస్తోంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. నేడు(శనివారం) తన పుట్టినరోజు అయినప్పటికీ శృతిహాసన్ షూటింగ్ కి హాజరైంది. ఆమెకు చిత్ర యూనిట్ సర్ఫరైజ్ చేసింది. పెద్ద కేక్ ఎరేంజ్ చేసి శృతితో కట్ చేయించింది. ఈ సందర్బంగా తీసుకున్న కొన్ని ఫొటోలను నటుడు శివబాలాజి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

శివబాలాజి కాటమరాయుడు లో పవన్ కి తమ్ముడిగా నటిస్తున్నారు. అతనితో పాటు అజయ్, కమల్ కామరాజులు తమ్ముల్లుగా కనిపించనున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తున్నారు. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 29 న థియేటర్లలోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus