Shruti Haasan: నేటిజన్ పిచ్చి ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చిన శృతిహాసన్!

శృతిహాసన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ ఈ ఏడాది మొదట్లో చిరంజీవి బాలకృష్ణ సరసన నటించిన వాల్తేరు వీరయ్య,వీర సింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈమె మరో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించారు.

ఈ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన అభిమానులతో చాట్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా తాజాగా అస్క్ మీ ఎనీథింగ్ అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఇలా హీరోయిన్స్ అవకాశం ఇవ్వడంతో చాలామంది ఇదే అదునుగా భావించి కొన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు, వింత ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాంటివారికి సెలబ్రిటీలు వారి స్టైల్ లోనే సమాధానాలు కూడా చెబుతూ షాక్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే నటి శృతిహాసన్ కి సైతం ఇలాంటి ప్రశ్న ఎదురయింది. అందరూ కూడా తమ చిన్నప్పటి ఫోటోలను తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేయమని అడగగా ఒక నెటిజన్ మాత్రం ఏకంగా మీ పాదాల ఫోటోని షేర్ చేయండి అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఈమె (Shruti Haasan) ఏకంగా ఒక ఏలియన్ పాదాల ఫోటోలను షేర్ చేస్తూ బై అంటూ భారీగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు నెటిజన్ కి తిక్క కుదిరింది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus