Shruti Haasan: మిగిలిన హీరోయిన్లలా ‘రూల్‌’ పాటించని శ్రుతి హాసన్‌

చేసినన్ని రోజులు సినిమాలు చేయడం, ఆ తర్వాత కామ్‌గా ఉండటం… ‘ఏమైంది సినిమాలు తగ్గుతున్నాయ్‌’ అనే టాక్‌ మొదలవ్వగానే పెళ్లి చేసుకోవడం… చాలా మంది హీరోయిన్లు చేస్తున్న పని ఇదే. మరీ లేదంటే కాస్త ఫేమ్‌ డౌన్‌ అవ్వగానే పెళ్లి చేసుకోవడం… అయినా సినిమాలు కొనసాగించడం. మన తెలుగు హీరోయిన్లు ఎక్కువగా పాటించేవి ఈ రెండు రూల్సే. అయితే ఇవేవీ అధికారిక రూల్స్‌ కావు. కేవలం అనధికారికం. దీంతోపాటు మరొక రూల్‌ కూడా ఉంది. అదే బాగా డబ్బున్న వాణ్ని చూసి.. ఆ ఇంటికి ఇల్లాలు అయిపోవడం. ఇందులో తప్పు కూడా లేదు. ఫ్యూచర్‌ సేఫ్టీ కోసం ఆ మాత్రం ఆలోచన తప్పదు. అయితే ఈ రూల్స్‌కు శ్రుతి హాసన్‌ దూరమా? అంటే అవుననే అంటున్నారు.

శ్రుతి హాసన్‌ ఆలోచన శైలి ఇతరులకు భిన్నంగా ఉంటుంది. సినిమాల ఎంపిక, పాత్రల శైలి అన్నీ కాస్త తేడాగానే ఉంటాయి. అంతేకాదు ప్రియుణ్ని ఎంచుకునే విషయంలోనూ అదే పంథాలో వెళ్తోంది శ్రుతి. ఆమె ప్రస్తుతం శంతను హజారిక అనే డూడుల్‌ ఆర్టిస్ట్‌, ఇలస్ట్రేటర్‌తో ప్రేమలో ఉందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఆయనకు సంబంధించిన వర్క్‌ను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ప్రమోషన్‌ చేస్తుంటుంది. శంతను ఫైనాన్షియల్‌ బ్యాగ్రౌండ్‌ పెద్ద ఎక్కువేం ఉండదు. అలాగే అంతకుముందు శ్రుతి… ప్రేమలో ఉన్న మైఖేల్‌ కోర్సేల్‌ కూడా సాధారణ నటుడే.

ఇదంతా చూస్తుంటే శ్రుతి హాసన్‌ ప్రేమ… మిగిలిన నాయికలతో పోలిస్తే ‘అలగ్‌’ అనిపిస్తోంది. అందరితో డబ్బున్న ప్రేమికుడు/భర్త కావాలని శ్రుతి అనుకోవడం లేదు. మనసుకు నచ్చినవాడైతే చాలు అనుకుంటుందేమో. ఆమె తోటి నాయికలు చాలామంది బడా వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను వివాహం చేసుకున్నారు. కానీ శ్రుతి మాత్రం డిఫరెంట్‌.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus