మీడియాపై మండి పడ్డ శృతిహాసన్
- August 5, 2017 / 07:29 AM ISTByFilmy Focus
మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ శృతిహాసన్ నిత్యం వార్తల్లో ఉంటోంది. అందులో కొన్ని శృతి సినీ విజయాల గురించి అయితే మరికొన్ని ఆమె వ్యక్తిగత విషయాల గురించి. శృతి తమిళంలో ‘సంఘమిత్ర’ సినిమాకోసం కష్టపడింది. షూటింగ్ మొదలు అని చెప్పగానే ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చింది. ఇందులో శృతి వైపు తప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక పెళ్లికాకముందే ప్రియుడుతో ముంబైలో కాపురం పెట్టిందని కూడా కొన్ని రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. శృతిహాసన్ ప్రేమని తండ్రి కమల్‌హాసన్ ఒప్పుకోలేదని, తండ్రికూతుళ్ళ మధ్య మాటల్లేవని గాసిప్ కూడా సోషల్ మీడియాలో విహారం చేస్తోంది. రీసెంట్ ఈ విషయంపై కమల్ మాట్లాడుతూ ‘నా కుమార్తె ప్రేమ విషయంలో నేను స్పందించడానికేమీ లేదు..’ అంటూ మీడియా ముందు చెప్పడంతో శృతి ప్రేమ, పెళ్లి హాట్ టాపిక్ అయింది.
నిన్న ఈ విషయాలపై శృతిని వివరణ కోరగా.. ఆమె ఘాటుగా స్పందించింది. ” నా జీవితం నా ఇష్టం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు నాకు ఉంది. అది ప్రేమ కావొచ్చు, సినిమా కావొచ్చు..’ అంటూ స్పష్టం చేసింది. సినిమాలు తగ్గిపోతున్నాయి కదా.. నటనకు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే .. “నటనకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి రాదు. వచ్చినా బాధపడను. ఎందుకంటే నటనే నా జీవితం కాదు. నా లైఫ్ లో ఇంకా ఎన్నో ఉన్నాయి” అంటూ శృతి గట్టిగా సమాధానం ఇచ్చింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











