తెలుగు తెరపై మాత్రమే కాదు.. అసలు వెండితెర మీద శ్రుతి హాసన్ కనిపించి దాదాపు రెండేళ్లవుతోంది. ఆమె నటించిన ఆఖరి చిత్రం “కాటమరాయుడు”. ఆ సినిమా తర్వాత ఆమె మరో తెలుగు కానీ తమిళ సినిమా కానీ అంగీకరించలేదు. ఒప్పుకున్న ఒకే ఒక్క “శభాష్ నాయుడు” కూడా ఆగిపోవడంతో అసలు ఆమె సినిమాలు అంగీకరించలేదు. తన చిన్నప్పటి ఆశయం అయిన సింగింగ్ డ్రీమ్ ను ఎచీవ్ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టింది.
అయితే.. చాలా కాలం తర్వాత నటి శ్రుతి హాసన్ రెండు సినిమాలకు సంతకం చేసింది. హిందీలో “పవర్”, తమిళంలో “లాభం” సినిమాలతో బిజీగా ఉంది. తన ప్రియుడు మైఖెల్ కోర్సెల్‌తో విడిపోయిన తర్వాత ఆ విషయమై ఎప్పుడూ స్పందించని శ్రుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. “నేనిప్పుడు సింగిల్‌గా హ్యాపీగానే ఉన్నా. మైఖెల్‌తో బ్రేకప్ అయ్యానని తెలీగానే చాలా మంది “శ్రుతి ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి” అని షాకయ్యారు. కానీ నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం ఇది. నాకు నా సంతోషమే ముఖ్యం. జీవితం పెర్‌ఫ్యూం లాంటిది. ఒకేసారి ఎక్కువ పెర్‌ఫ్యూంల వాసనలు చూసేస్తే ఏది ఏ వాసనో తెలీదు. జీవితం కూడా అంతే. ఏది ఎలా జరగాలన్నది మనం నిర్ణయించలేం” అని చెప్పుకొచ్చింది శ్రుతి.