లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి శృతిహాసన్. కెరీర్ మొదట్లో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి ఈమె అనంతరం ఇండస్ట్రీలో తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే తన వ్యక్తిగత కారణాలవల్ల ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే తిరిగి క్రాక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఏడాది మొదట్లోనే బాలకృష్ణ చిరంజీవి సరసన నటించిన వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శృతిహాసన్ 2 బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇక తాజాగా ఈమె సలార్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయిందని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇలా తన షూటింగ్ పూర్తి కావడంతో ఈమె ముంబై వెళ్ళిపోయారు. శృతిహాసన్ గత కొంతకాలంగా తన ప్రియుడు శంతను హజారికతో ప్రేమలో ఉండడమే కాకుండా వీరిద్దరూ కూడా ముంబైలో ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వీరికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
శృతిహాసన్ వరుస సినిమా షూటింగులతో చాలా కాలం తన ప్రియుడికి దూరంగా ఉండడంతో ముంబై వెళ్లిన క్షణమే తన ప్రియుడుతో కలిసి సరదాగా బయట డిన్నర్ చేశారు. ఈ క్రమంలోనే తన ప్రియుడు గురించి వీరి ఆహారపు అలవాట్ల గురించి శృతిహాసన్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.బయటకు వెళ్లి ఫుడ్ తినడం నాకు ఇష్టం.. నేను, శంతను తినడం కోసమే బతుకుతుంటాం.. తినేటప్పుడు ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటాం.. నాలానే భోజన ప్రియుడ్ని నేను ఇష్టపడుతున్నందుకు, నా జీవితంలోకి వచ్చినందుకు నేనింతే లక్కీ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?