సినిమారంగంలో తక్కువ లైఫ్ కలిగిన వారు ఎవరంటే ముందుగా వచ్చే సమాధానం హీరోయిన్స్. ఎవరికైనా అనుభవం పెరిగే కొద్దీ అవకాశాలు పెరుగుతాయి. రెమ్యునరేషన్ పెరుగుతాయి. హీరోయిన్స్ విషయంలో అనుభవం పెరిగినప్పటికీ.. వయసు పెరిగేకొద్దీ అవకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే అందం ఉన్నపుడే వాళ్ళు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎనిమిది – పదేళ్ళ కెరీర్ లోనే సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వేరే పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అలా హీరోయిన్ రోల్ కి దూరం కావాల్సిన పరిస్థితుల్లో ఉన్న నటీమణులు ఎవరంటే.. కాజల్ అగర్వాల్.. శృతి హాసన్.. తమన్నా. పదేళ్లకు పైగా పరిశ్రమలో ఉన్న టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ జోరు తగ్గింది. అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఏకంగా రెండు సినిమాలకు ఓకే చెప్పింది.
మిల్కీ బ్యూటీ తమన్నా చేతిలోనూ సైరా, F2 .. మించి సినిమాలు లేవు. బాహుబలి వంటి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఉత్తరాదిన, దక్షిణాదిన అభిమానులున్నప్పటికీ అవకాశాలను అందుకోలేకపోతోంది. శృతి హాసన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాటమ రాయుడు తర్వాత తెలుగులో కనిపించలేదు. తమిళ దర్శకుడు సుందర్ సి వందల కోట్లతో తీయాలన్న సంఘమిత్ర నుంచి బయటికి వచ్చింది. తండ్రితో కలిసి చేస్తున్న శెభాష్ నాయుడు తప్ప ఆమె ఏ ప్రాజక్ట్ కి సైన్ చేసినట్టు వార్తలు రాలేదు. సో ఈ ముగ్గురు హీరోయిన్ పాత్రకు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.