Allu Arjun: గుమ్మడికాయతో దిష్టి తీసిన కుటుంబ సభ్యులు!

ఓ పెద్ద హైటెన్షన్ డ్రామాకు తెరపడింది. సినిమా ఇండస్ట్రీపై తెలంగాణ ప్రభుత్వం విసిరిన బ్రహ్మాస్త్రం నుండి చిన్నపాటి విముక్తి లభించింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయానికి అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కేసులో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళకుండా, గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడినుండి కోర్టుకు, అట్నుంచి డైరెక్ట్ గా చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించిన విషయం తెలిసిందే.

Allu Arjun

అయితే.. లాయర్ నిరంజన్ రెడ్డి బలమైన వాదనల కారణంగా బన్నీకి నిన్న సాయంత్రమే బెయిల్ వచ్చినప్పటికీ.. బెయిల్ పేపర్స్ క్లియర్ గా లేవు అంటూ రాత్రంతా జైల్లోనే ఉంచారు అల్లు అర్జున్ ని. ఎట్టకేలకు ఇవాళ (డిసెంబర్ 14) ఉదయం 6 గంటల సమయంలో చంచల్ గూడ జైలు వెనుక గేటు నుండి అల్లు అర్జున్ ను బెయిల్ మీద బయటకు పంపారు పోలీసులు.

అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వెళ్లకుండా.. గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లి అక్కడ తన స్నేహితులను కలుసుకుని, అక్కడినుండి ఇంటికి చేరుకున్నాడు. బన్నీకి గుమ్మడికాయతో దిష్టి తీసి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. “నేను బాగున్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు.

నేను చట్టాన్ని గౌరవిస్తున్నా, కోర్టులో కేసు ఉంది ఇప్పుడెం మాట్లాడను, రేవతి కుటుంబానికి నా సానుభూతి.. ఇది అనుకోకుండా జరిగిన ఘటన” అన్నారు. ఇకపోతే.. అల్లు అర్జున్ కి లభించింది నాలుగు వారాల బెయిల్ మాత్రమే, కోర్టులో పర్మనెంట్ బెయిల్ తీసుకోవాల్సిన పని లాయర్ల మీద ఉంది. సోమవారం నుండి ఆ పనిలో ఉంటారు వారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus