ఎట్టకేలకు తన బ్రేకప్ పై స్పందించిన శృతి హాసన్..!

కమల్ హాసన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శృతి హాసన్. సౌత్ లో దాదాపు అందరి స్టార్ హీరోలందరితోనూ నటించేసిన ఈ భామ ఎప్పుడూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉండేది. కానీ మైకేల్ కోర్సలే తో ప్రేమలో పడి సినిమాలను తగ్గించేసింది. వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని బలంగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా వీళ్ళిద్దరూ విడిపోవడంతో అందరూ షాక్ కు గురయ్యారు. మైకేల్.. శృతితో బ్రేకప్ అయ్యానంటూ ప్రకటించేశాడు. కానీ శృతి మాత్రం ఈ విషయం పై ఇప్పటివరకూ స్పందించలేదు. మైకేల్ తో బ్రేకప్ అయిన తరువాత కొన్నాళ్ళు లండన్ లో లైవ్ మ్యూజిక్ షోలలో పాల్గొంది ఈ బ్యూటీ.

ఎట్టకేలకు మంచు లక్ష్మి నిర్వహిస్తున్న టాక్ షో ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ షో లో తన బ్రేకప్ గురించి మాట్లాడింది. శృతి మాట్లాడుతూ.. “బయటకు కఠినంగా కనిపించినా నేను చాలా అమాయకంగా ఉంటాను. నేను చాలా ఎమోషనల్. దాంతో నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. నన్ను తమ ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటారు. అయితే అవన్నీ నాకు మంచి అనుభవాలే. మైకేల్‌తో బ్రేకప్ దురదృష్టకరం” అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ తో మైకేల్… శృతి పై ఆధిపత్యం చూపించడం వలనే తనతో విడిపోయానని శృతి స్పష్టంచేసింది.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus