Shruti Haasan: శ్రుతి హాసన్ పచ్చబొట్టు ఎవరిది వేయించుకుందో తెలుసా?

ఈ గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ అందంగా కనింపించడానికి పొట్టి దుస్తులు ధరిస్తూ ఉంటారు. స్టైల్ గా ఉండే దుస్తులు ధరిస్తూ ఉంటారు.. ఇటీవల కాలంలో పచ్చబొట్టు ట్రేండ్ నడిస్తోంది.. గత కొద్ది రోజులుగా సమంత పచ్చబొట్టు సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసింది..ఆ విషయంలో ట్రెండింగ్ లో ఉండగానే శృతి హాసన్ పచ్చబొట్టుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏళ్లకు ఏళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న శ్రుతిహాసన్ తాజాగా మరో పచ్చబొట్టును వేసుకుంది.

అయితే.. ఇప్పటివరకు ఆమె వంటి మీద ఉన్న టాటూలకు భిన్నమైనదిగా దీన్ని చెప్పాలి. తాజాగా ఆమె వేసుకున్న పచ్చబొట్టును చూస్తే.. శ్రుతిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించటమే కాదు.. ఆమెలోని కొత్త కోణాన్ని అందరికి అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి. నలభయ్యో పడికిదగ్గర అవుతున్న ఈ ముద్దుగుమ్మ.. స్టైల్ కు.. ష్యాషన్ కు ఐకాన్ లా వ్యవహరిస్తుంటారు. రోటీన్ కు ట్రెండ్ కు భిన్నంగా వ్యవహరించే ఆమె.. తాజాగా వేయించుకున్న పచ్చబొట్టు అందరిని ఆకర్షిస్తోంది.

ఇప్పటికే ఆమె ఒంటి మీద ఉన్న పచ్చబొట్టులను చూస్తే.. మణికట్టు పైన గులాబీ.. చెవి వెనుక సంగీతాన్ని గుర్తు చేసేలా పచ్చబొట్టు వేయించుకోవటం తెలిసిందే. తాజాగా వేయించుకున్న పచ్చబొట్టు మాత్రంఈ రెండింటికి భిన్నమైనది. అసలు శ్రుతి నుంచి ఏ మాత్రం అంచనా వేయలేనిదిగా చెబుతున్నారు. తాజాగా ఆమె తన ఇష్టదైవం మురుగన్ ఆయుధాన్ని టాటూలా వేయించుకున్నారు. అంతేకాదు..తమిళంలో తన పేరును వేయించుకోవటం గమనార్హం.

తాను వేయించుకున్న కొత్త టాటూను ఇన్ స్టాలో షేర్ చేసిన (Shruti Haasan) శ్రుతి.. తానెప్పుడూ అధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంటానని చెప్పారు. తన మనసులో మురుగన్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని.. తాజా పచ్చబొట్టుతో తనలోని భక్తిని ప్రదర్శించాలని భావించినట్లుగా చెప్పుకొచ్చారు. మొత్తానికి శ్రుతిలో కొత్త మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించట్లేదు? అని నెటిజన్లు అంటున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus