ప్రముఖ కథానాయిక, మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) లవ్‌లు ఉన్నాయి, బ్రేకప్‌లూ ఉన్నాయి. అంతేకాదు పెళ్లి మీద డిఫరెంట్ అభిప్రాయాలూ ఉన్నాయి. తాజాగా మరోసారి వీటి మీద ఫుల్ క్లారిటీ ఇచ్చింది. నా పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు నా నిర్ణయం ఇదే అని క్లారిటీగా చెప్పింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి హాసన్.. సినిమా అప్‌డేట్‌లతో పాటు వ్యక్తిగత విషయాలనూ షేర్ చేస్తుంటుంది. మరోవైపు ఇంటర్వ్యూల్లో అభిమానులతో పంచుకుంటుంటారు.
Shruti Haasan
సోషల్ మీడియాతో పాటు వరుస ఇంటర్వ్యూల్లో సందడి చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావించారు. వివాహబంధంపై తన నిర్ణయాన్ని చెప్పారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని గతంలో చెప్పిన శ్రుతి మరోసారి అదే మాట మీద నిలబడుతున్నా అని చెప్పారు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఊహించని విధంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ.. ఎప్పటికీ చేసుకోను అని మాత్రం చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది.
అయితే తాను రిలేషన్‌లో ఉండడాన్ని ఇష్టపడతానని, రొమాంటిక్‌గా ఉండడం ఇష్టపడతాను అని తన ఆసక్తులు వివరించింది. అంతేకాదు చుట్టూ ఉండేవారితో చనువుగా ఉంటాను అని కూడా చెప్పింది. మరి పూర్తిగా పెళ్లి వద్దా అని అడిగితే.. భవిష్యత్తులో ఎవరైనా మనసుకు దగ్గరైన వాళ్లు ఎదురైతే వారిని వివాహం చేసుకుంటాను అని చెప్పింది. ఇక రిలేషన్, పెళ్లి గురించి శ్రుతి ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదనే విషయం తెలిసిందే. ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా?’ అని ఆ మధ్య ఒక నెటిజన్ అడిగితే..
నాకు ఇలాంటి ప్రశ్నలు నచ్చవు అని గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఇప్పుడు తాను సింగిలే అని, రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పింది. ప్రస్తుతానికి వర్క్‌లో ఉన్నానని, జీవితాన్నీ ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పింది. సినిమాల సంగతి చూస్తే ప్రభాస్ ‘సలార్: శౌర్యాంగ పర్వం(Salaar)’, రజనీకాంత్ (Rajinikanth) ‘కూలి’ (Coolie) సినిమాల్లో నటిస్తోంది అడివి శేష్ (Adivi Sesh) ‘డెకాయిట్’ నుంచి రీసెంట్‌గా తప్పుకుంది. కారణాలు అయితే తెలియలేదు.