ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు రెమ్యూనరేషన్లు తగ్గించుకోవాలని నిర్మాతల నుండి ప్రతిపాదన వస్తోంది. మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సభ్యులకు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ లేఖ కూడా రాసింది. ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు, అందులో ఇరవై శాతం తగ్గించి తీసుకోవాలనేది అందులో సారాంశం. ఈ నేపథ్యంలో రెమ్యూనరేషన్ల గురించి శృతి హాసన్ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. తమిళ్ లో విజయ్ సేతుపతి సరసన ‘లాభం’ సినిమాలో శృతి హాసన్ యాక్ట్ చేస్తున్నారు.
రీసెంట్ గా చెన్నైలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు. వస్తూ వస్తూ మీడియాతో మాట్లాడారు. “కొంతమంది యాక్టర్లు టెక్నీషియన్లు రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి అంగీకరించారు” అని శ్రుతి హాసన్ తో చెప్పగా… “కోట్ల రూపాయల్లో రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు తగ్గించి తీసుకోవచ్చు. హీరోయిన్లకు ఎక్కువేమీ ఇవ్వరు. హీరోలకు హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ లలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇది మారడానికి ఓ ఇరవై ఏళ్లు పట్టవచ్చు” అని నర్మగర్భంగా మాట్లాడారు. రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి శృతిహాసన్ సుముఖంగా లేరనుకుంట!
థియేటర్లలో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని ఏ అంశం మీద శృతి హాసన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలకు తీవ్ర నష్టాలు వస్తాయని ఆమె అన్నారు. ఓటీటీ వేడుకలకు ప్రేక్షకులు అలవాటు పడిన అవెంజర్స్ వంటి సినిమాలను థియేటర్లలోనే ఎంజాయ్ చేయగలమని శృతి అన్నారు.
Most Recommended Video
చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!