Shruti Haasan: కర్మ తప్పకుండా శిక్షిస్తుంది… వైరల్ అవుతున్న శృతిహాసన్ కామెంట్స్!

  • August 19, 2023 / 09:18 PM IST

సినీ నటి శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు నటిగా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ ఏడాది మొదట్లో చిరంజీవి బాలకృష్ణతో సినిమాలు చేసి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇలా కెరియర్ పరంగా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈమె శంతను అనే వ్యక్తితో ప్రస్తుతం ప్రేమలో ఉండటమే కాకుండా ఆయనతో సహజీవనం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రియుడు గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకొనే ఈమె తాజాగా ఒక షాకింగ్ పోస్ట్ చేశారు.

శృతిహాసన్ (Shruti Haasan) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను కొందరిని గమనిస్తూ ఉన్నానని, మంచిగా ఉంటూనే గోతులు తీస్తుంటారని అయితే వారి గోతిలో వారే పడుతుంటారని ఈమె తెలిపారు. అయితే ఇలాంటి వారిని చూసినప్పుడు మౌనంగా నేను నా పని చేసుకో పోతానని శృతిహాసన్ తెలిపారు. కర్మ వారికి తగ్గ ఫలితం ఇస్తూ శిక్ష కూడా వేస్తుంది అంటూ ఈమె చెప్పుకొచ్చారు.

ఇలా ఉన్నఫలంగా శృతిహాసన్ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ అనుభవిస్తారు అంటూ పోస్ట్ చేయడంతో అసలు శృతిహాసన్ ఎవరిని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారు అంటూ పలువురు ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ఈమె ఇలా పోస్ట్ చేయడానికి కారణం ఏంటి ఎవరైనా తనని విమర్శలకు గురి చేశారా అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus