Shruti Haasan: హాలీవుడ్ హీరోతో శృతిహాసన్ సినిమా!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్.. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడే అరకొర అవకాశాలతో నెట్టుకొచ్చింది. మధ్యలో బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవ్వడంతో డిప్రెషన్ లోకి వెళ్లింది. ఆ తరువాత మెల్లగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. తిరిగి తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఆమె చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తుంది.

అలానే ప్రభాస్ ‘సలార్’ సినిమా ఒప్పుకుంది. అలానే మరికొన్ని సినిమాల కోసం ఆమెని సంప్రదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీకి ఇంటెర్నేషనల్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ‘ది ఐ’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ లో కనిపించబోతుంది శృతి. హాలీవుడ్ నటుడు మార్క్ రౌలీ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. 1980ల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో శృతిహాసన్ భర్త చనిపోయిన భార్య క్యారెక్టర్ లో కనిపించనుంది.

గ్రీక్ ప్రొడక్షన్ కంపెనీ ఆర్గోనాట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. డాఫ్నే స్కామన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినందుకు శృతిహాసన్ తెగ సంబరపడిపోతుంది. ప్రస్తుతం ఆమె గ్రీస్ లో ఉంది. ఈ విషయాన్ని శృతిహాసన్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

ఈ సినిమా గనుక క్లిక్ అయితే శృతిహాసన్ కి మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇప్పటికే దీపికా, ప్రియాంక చోప్రా లాంటి తారలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు శృతిహాసన్ కి ఛాన్స్ వచ్చింది. మరి దీన్ని ఆమె ఎలా వినియోగించుకుంటుందో చూడాలి!

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus