Shruti Haasan: నోరు మూసుకుని వెళ్లు.. వైరల్ అవుతున్న శృతి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ (Shruti Haasan) కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఒకరికి నచ్చినట్టుగా కాకుండా తనకు నచ్చిన విధంగా జీవించడానికి ఈ బ్యూటీ ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం శృతి హాసన్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అయితే ఒక నెటిజన్ శృతి హాసన్ ను సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా అని అడిగారు.

ఈ రకమైన జాతి వివక్షను నేను అస్సలు సహించనని ఆమె తెలిపారు. మేము తమిళనాడుకు చెందిన వాళ్లం కాబట్టి మమ్మల్ని చూసి ఇడ్లీ, దోశ, సాంబార్ ఇలా పిలిస్తే అస్సలు ఊరుకోమని శృతి హాసన్ పేర్కొన్నారు. మీరు మమ్మల్ని అనుకరించలేరు కాబట్టి మాలా ఉండాలని ట్రై చేయవద్దని ఆమె చెప్పుకొచ్చారు. ఎలా పడితే అలా పిలిస్తే మాత్రం మేము దాన్ని కామెడీగా తీసుకోమని శృతి హాసన్ పేర్కొన్నారు.

సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పాలని అడిగావు కదా “నోరు మూసుకుని వెళ్లు” అంటూ శృతి హాసన్ ఈ పదాలను మాత్రం తమిళంలో రాసుకొచ్చారు. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోను ఒక బాలీవుడ్ హీరో ఇడ్లీ వడ అని సంబోధించారు. అలా పిలవడం వల్లే శృతి హాసన్ ఈ రేంజ్ లో స్పందించి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

శృతి హాసన్ నటిస్తున్న సలార్2 (Salaar) సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. శృతి హాసన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం కంటే మంచి సినిమాలలో నటించడం ముఖ్యమని శృతి హాసన్ భావిస్తున్నారు. శృతికి క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus