వావ్.. శృతీ హాసనా.. మజాకా..! నెటిజెన్ కు దిమ్మతిరిగిపోయే రిప్లై ఇది..!

యూనివర్సల్ స్టార్‌ హీరో కమల్ హాసన్ కూతురిగా కంటే తన సొంత ట్యాలెంట్‌ తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శృతీ హాసన్. కేవలం హీరోయిన్‌గానే కాకుండా సింగర్ గా, డ్యాన్సర్‌గా సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది. గబ్బర్ సింగ్, రేసు గుర్రం, శ్రీమంతుడు వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ అటు తరువాత పర్సనల్ రీజన్స్ కారణంగా తన సినీ కెరీర్ ను అశ్రద్ధ చేసింది. దాదాపు 2 ఏళ్ళ వరకూ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శృతీ..

మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగిస్తోంది. సంక్రాంతికి ఆమె ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతేకాకుండా తాజాగా వచ్చిన ‘వకీల్ సాబ్’ లో కూడా చిన్న అతిధి పాత్ర పోషించి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా.. ఎటువంటి విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్టు నిర్మొహమాటంగా తెలియజేసే శృతీ.. ఇప్పుడు కూడా ఓ విషయంలో అదే కోవలో నెటిజెన్ కు ఘాటు రిప్లై ఇచ్చింది. వివరాల్లోకి వెళితే ఇటీవల ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.

ఈ నేపథ్యంలో ఓ నెటిజెన్ అతి ఉత్సాహంతో ‘మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలని’ కోరాడు. ఆ ప్రశ్నకు శృతీ దిమ్మతిరిగే సమాధానం చెప్పి ఆ నెటిజెన్ నోరు మూయించింది. శృతీ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అనుకుంటున్నారా?.’100 నెంబర్’ ఇచ్చి ఇదే తన ఫోన్ నెంబర్ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇక శృతీ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘సలార్’ లో హీరోయిన్ గా నటిస్తోంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus