Shruti Haasan, Bigg Boss: తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టనున్న శృతీ హాసన్!

‘బిగ్‌బాస్’ రియాలిటీ షో నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. హాలీవుడ్లో మొదలైన ఈ షోని నార్త్ సోదరులు బాగా ఆదరించారు. అటు తర్వాత మెల్లగా సౌత్ కు దిగుమతి అయ్యింది ఈ షో. స్టార్ హీరోలు హోస్ట్‌లుగా , సినిమా వాళ్ళు అలాగే వివిధ రంగాల్లో ప్రాచుర్యం చెందిన వారు ఈ షోలో కంటెస్టెంట్స్‌గా పాల్గొంటూ ఉండడంతో అంతా ఈ షోకి ఎడిక్ట్ అయిపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక శని, ఆదివారాలు వచ్చే హోస్ట్ ల కోసం అలాగే వారు కంటెస్టెంట్ లతో మాట్లాడే విధానం కోసం ఈ షోని ఆన్లైన్ లో కూడా రిపీటెడ్ గా చూస్తుంటారు ప్రేక్షకులు.ఇదిలా ఉండగా… గతేడాది ‘బిగ్‌బాస్‌4’లో నాగార్జున అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సమంత వచ్చి వీకెండ్ ఎపిసోడ్ ను హోస్ట్‌ చేసింది. అప్పుడు టి.ఆర్.పి ఓ రేంజ్లో నమోదయ్యింది. ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ అవ్వబోతుంది. కాకపోతే ఈసారి తమిళ బిగ్‌బాస్‌లో…!

తాజాగా కమల్‌ హాసన్‌ కోవిడ్ భారిన పడడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.దీంతో ఆయన మరో రెండు వారాల పాటు బిగ్ బాస్ షోకి దూరం కాబోతున్నారు. దీంతో కమల్‌ స్థానంలో ఆయన కూతురు మరియు స్టార్ హీరోయిన్ అయిన శృతి హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించనుందని టాక్. తమిళ బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఈ విషయమై శృతీ హాసన్ ను సంపాదించడం ఆమె ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందని సమాచారం. శృతీ హోస్ట్ చేస్తుంది కాబట్టి టి.ఆర్.పి రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus